Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లకు పప్పు, అన్నం!

భారత వంటకాలతో కూడిన మెనూకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన ఆమోదం తెలిపింది. పోషకాహార నిపుణుడి సూచనల మేరకే ఇవి రూపొందించారు.

Written By: Raj Shekar, Updated On : April 4, 2024 12:39 pm

Paris Olympics 2024

Follow us on

Paris Olympics 2024: క్రీడలు ఏదైనా.. టోర్నీ ఎక్కడ జరిగినా.. స్థానిక ఆటగాళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ, విదేశాల నుంచి టోర్నీలో పాల్గొనేందుకు వచ్చే ఆటగాళ్లు అక్కడి వాతావరణంతోపాటు ఆహారానికి అలవాటు పడడానికి చాలా టైం పడుతుంది. ఫుడ్‌ సరిగా లేకుంటే సరైన ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతారు. అస్వస్థతకు గురవుతారు. అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. ఒలిపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. ఒలింపిక్స్‌ను భారత దేశంలో నిర్వహించడం లేదు. దీంతో మన ఆటగాళ్లే విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నారు. అయితే అక్కడి ఫుడ్‌ భారత ఆటగాళ్లకు సమస్యగా మారుతోంది. అయితే ఈ సమస్యకు రాబోయే ఒలింపిక్స్‌లో చెక్‌ పడనుంది. వచ్చే ఒలింపిక్స్‌లో భారతీయులకు పప్పు, అన్నం వడ్డించేందుకు అంతర్జాతీయ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ అంగీకరించింది.

ఇక ఇష్టమైన భాతీయ వంటకాలు..
ఈ ఏడాది ప్యారిస్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించనున్నారు. ఇందుకోసం భారత ఆటగాళ్లు అక్కడికి వెళ్లనున్నారు. ఈ ఒలింపిక్స్‌లో భారతీయ ఆటగాళ్లకు ఇక ఫుడ్‌ సమస్య ఉండదు. అథ్లెట్ల గ్రామంలో మనవాళ్లు ఎంచక్కా బాస్మతి బియ్యంతో చేసిన అన్నం, పప్పు, చపాతీ, ఆలుగడ్డ, గోబీ, కోడి కూర పులుసులను ఆస్వాధించవచ్చు. భారత అథ్లెట్లకు ప్రత్యేక ఆహారం కోసం ఇప్పటికే ఓలింపిక్స్‌ నిర్వాహకులకు ఈమేరకు భోజనాల పట్టికను పంపించామని భారత డిప్యూటీ చెఫ్‌ డి మిషన్‌ శివ కేశవన్‌ తెలిపారు.

భారత వంటకాలకు అంగీకారం..
భారత వంటకాలతో కూడిన మెనూకు ఇంటర్నేషనల్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన ఆమోదం తెలిపింది. పోషకాహార నిపుణుడి సూచనల మేరకే ఇవి రూపొందించారు. మన అథ్లెట్ల విషయంలో ఆహారం అనేది సమస్య. ఒలింపిక్స్‌లో ప్రధాన భోజన శాలలో ప్రపంచవ్యాప్తంగా అన్నిరకాల వంటకాలు ఉంటున్నాయి. కానీ, భారత అథ్లెట్ల కోసం దక్షిణాసియా వంటకాలు కావాలని భారత అథ్లెటిక్స్‌ అధికారులు కోరారు. దీంతో అంతర్జాతీయ ఒలింపిక్స్‌ మండలి అంగీకరించింది.

అథ్లెట్ల గ్రామంలో క్రీడా సైన్స్‌..
ఇక అథ్లెట్ల గ్రామంలో డాక్టర్‌ దిన్‌షా పర్దీవాలా పర్యవేక్షణలో భారత క్రీడా సైన్స్‌ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. అగ్రశ్రేణి రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్, క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు దిన్‌షా చికిత్స అందించాడు. ఆ కేంద్రంలో పూర్తి ఔషధాలు, కోలుకునేందుకు అవసరమైన సామగ్రి ఉంటాయి. దీని ఏర్పాటు కోసం భారత్‌ నుంచి చాలా యంత్రాలను అక్కడికి చేరవేశారు. పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్భంగా రవాణా, నియమ నిబంధనల విషయాల గురించి మన అథ్లెట్లకు ముందుగానే వివరించనున్నారు.