https://oktelugu.com/

Twins: వారికే ఎక్కువగా కవలలు పుట్టే అవకాశం ఉంది.. ఈ లక్షణాలు మీలో ఉన్నాయా?

కవలలు రెండు రకాలుగా పుడతారు. కొందరు ఒకేలా కనిపిస్తే మరికొందరు కనిపించరు. అండం, శుక్రకణాల కలయిక జరిగి ఆ తర్వాత అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోటులుగా ఏర్పడుతాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 4, 2024 / 12:31 PM IST

    Twins

    Follow us on

    Twins: పిల్లలు లేని ఇల్లు ఊహించుకోవడానికి కూడా ధైర్యంగా ఉండదు. పెళ్లి ఆ తర్వాత వెంటనే ఎదురయ్యే ప్రశ్న ఏమైనా గుడ్ న్యూస్ హా అంటూ అడుగుతారు. ఇక కాస్త లేట్ అయితే వామ్మో ఇతరులు అడిగే ప్రశ్నలను భరించలేక బయటకు వెళ్లాలన్నా భయపడాల్సిందే. ఇదిలా ఉంటే కవల పిల్లలకు జన్మనిస్తే ఎలా ఉంటుంది. వామ్మో అది మరో టెన్షన్ అనుకుంటున్నారా? వారి ఆలనా పాలనా చూసుకోవడం, శ్రద్ధ, పెరుగుతున్న కొద్ది ఇద్దరికీ అయ్యే ఖర్చు రెండు కూడా రెట్టింపు అవుతాయి.

    కవలలు రెండు రకాలుగా పుడతారు. కొందరు ఒకేలా కనిపిస్తే మరికొందరు కనిపించరు. అండం, శుక్రకణాల కలయిక జరిగి ఆ తర్వాత అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోటులుగా ఏర్పడుతాయి. దీని వల్ల ఒకేలా కనిపించే కవలలు పుడతారు. ఒకే రకంగా లేని కవలలో అలా జరగదు. రెండు అండాలు కలిసి ఫలదీకరణం చెందుతాయి. సో సేమ్ కనిపించరు. ఇదిలా ఉంటే ఇలా కవలలు పుట్టే అవకాశం ఎవరిలో ఎక్కువగా ఉంటుందో తెలుసా?

    చాలా మంది కుటుంబాలలో కవలలు ఎక్కువగా ఉన్నారని చెబుతుంటారు. ఇది తప్పు కాకపోవచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా కవలలు ఎక్కువగా పుడుతుంటారు. అందుకే వారి కుటుంబంలో కవలలు ఎక్కువగా ఉంటారు. ఏదైనా ఒకే కుటుంబంలో గతంలో కవలలు ఎక్కువగా పుట్టినట్టు ఉంటే ఆ కుటుంబంలో మళ్లీ కవలలు పుట్టే అవకాశం ఉంటుంది. మీ ఫ్యామిలీ లో కవలలు ఉంటే మీకు కూడా పుట్టే అవకాశం ఉంది.

    తల్లి తరుపు కుటుంబంలో కవలలు ఉంటే కవలలు పుట్టే అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది. మహిళ వయసు 35 నుంచి 40 ఉంటే ఎక్కువ ఉన్నా కూడా కవలలకు జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్ది స్త్రీ శరీరంలో హార్మోన్ల మార్పులు వస్తుంటాయి. యుక్త వయసు చివరలో అండోత్సర్గం పెరుగుతుంది. ఇది కూడా కవలలు పుట్టే అవకాశాన్ని అందిస్తుంది. అయితే పిల్లలు లేరని రకరకాల మందులు వాడటం వల్ల కూడా కవలలు పుట్టే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.