Brave Iranian woman: ఇరాన్ (Iran) దేశంలో ఖమేని(Khameni) కి వ్యతిరేకంగా నిరసనలు తారస్థాయికి చేరాయి. ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చినికి చినికి గాలి వానలాగా మారాయి. చివరికి ఆ దేశంలో పరిస్థితిని అదుపు తప్పేలా చేశాయి. ఇప్పటికే ఆ దేశంలో నిరసనల వల్ల వందల మంది చనిపోయారు. వేలమంది గాయపడ్డారు. ఇటీవల ఇరాన్ మహిళలు సిగరెట్లు వెలిగించుకొని, ఖమేనీ చిత్రపటాన్ని తగలబెట్టారు. దానికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇప్పుడు దానికి మించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఖమేనీ కి వ్యతిరేకంగా ఓ యువతి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసింది. తన బురఖా తొలగించుకొని.. నినాదాలు చేసింది. ” మేము ఇప్పుడు స్వేచ్ఛా అనుభవిస్తున్నాం. గాలిని ముక్కుల నిండా పీల్చుతున్నాం. ఇది మా పోరాటానికి దక్కిన గౌరవం. ఇకపై మేము ఇలానే ఉంటాం. మా స్వాభిమానాన్ని కొనసాగిస్తుంటాం. మాకు సంబంధించిన వరకు ఇకపై ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ధైర్యంగా అడుగులు వేయడం మేము నేర్చుకుంటామని” ఆ యువతి వ్యాఖ్యానించింది.
గతంలో ఇరాన్ దేశంలో మహిళలపై తీవ్ర ఆంక్షలు ఉండేవి. చట్టాల పేరు చెప్పి మహిళలను ఇబ్బంది పెట్టేవారు. బయటికి వెళ్లడానికి ఒప్పుకునేవారు కాదు. చదువు విషయంలో కూడా రకరకాల ఆటంకాలు కల్పించేవారు. అయితే ఎప్పుడైతే మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించడం మొదలుపెట్టారో.. అప్పటినుంచి పరిస్థితులు మారిపోయాయి. చివరికి ఖమేనీ కుర్చీ కిందికి నీళ్లు వచ్చాయి. చివరికి అక్కడ ఖమేనీ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చింది. అమెరికా కూడా దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో అక్కడ ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాని కంటే ముందే అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. జనం లక్షల మంది వీధుల్లోకి వస్తున్నారు. ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కొంతకాలంగా ఈ తరహా నిరసనలు అక్కడ పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఎక్కువవుతున్నాయి.
ఖమేనీ అనేక రకాల చట్టాలను తీసుకొచ్చారు. అయితే ఇవన్నీ కూడా మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మొదటి నుంచి కూడా మహిళలు ఖమేని కి వ్యతిరేకంగానే ఉద్యమాలు చేస్తున్నారు. ముఖ్యంగా వస్త్రధారణ విషయంలో ఖమేనీ కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు. అవి కాస్త వివాదాస్పదమయ్యాయి. అయినప్పటికీ, వాటి విషయంలో వెనక్కి తీసుకోవడానికి ఇరాన్ ప్రభుత్వం ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో అక్కడ నిరసనలు పెరిగిపోయాయి.
A brave woman in Iran publicly removes her hijab, defying her country’s oppressive Islamic regime that kills women for not wearing it.
This is true empowerment, unlike modern feminists in the West who defend Islamist rapists like Hamas.pic.twitter.com/uUxzT9pPvW
— Dr. Maalouf (@realMaalouf) January 2, 2026