New York : కొన్ని సార్లు అధికారులు చాలా కఠినంగా బిహేవ్ చేస్తుంటారు. వారి చర్యలు దేశాన్ని మాత్రమే కాదు యావత్ ప్రపంచాన్ని కూడా కలచివేస్తుంటాయి. గతంలో ఇలాంటి సంఘటనలు చాలా వైరల్ గా మారాయి. ఒక ఖైదిని, వ్యక్తిని పట్టుకొని కొట్టి, కాల్చి చంపిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. అమాయకులు అయినా, దోషులు అయినా శిక్షించడానికి దారులు ఉన్నా సరే వారి చేతుల్లోకి తీసుకుంటారు కొందరు అధికారులు. అయితే ఇప్పుడు న్యూయార్క్ లో ఇలాంటి ఒక వీడియో వైరల్ గా మారింది.
బ్రూక్స్ అనే నల్లజాతి ఖైదీని జైలు అధికారులు అతి దారుణంగా కొట్టి చంపారు. దీన్ని చూసిన ప్రపంచం నివ్వెర పోతుంది. ఇక వీడియోలో ఆ ఖైదీని అది దారుణంగా గాయపరిచి, ఇబ్బంది పెట్టి చివరకు చంపేశారు. అయితే ఈ బ్రూక్స్ అనే నల్లజాతి ఖైదీ ఉత్తర న్యూయార్క్ జైలులో దాడి చేశాడు. ఇందుకుగానూ 12 సంవత్సరాల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ తరుణంలో ఏం జరిగిందో ఏమో గానీ అధికారులు ఆయన మీద పాశవికంగా దాడి చేశారు. ఈ ఖైదీని కొట్టి చంపిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.
ఈ వీడియోలో ఒక అధికారి బ్రూక్స్ కడుపుపై కొట్టడానికి షూని ఉపయోగించారు. షూతో పదే పదే బాదాడు. మరొకరు అతని మెడను పైకి లాగి తిరిగి టేబుల్ మీద దారుణంగా పడేశాడు. అంత మంది కలిపి కొడుతుంటే ఈ ఒక్క వ్యక్తి ఏం చేయలేకుండా వారి దాడికి గురి అయ్యాడు. అలాగే కదలకుండా, టేబుల్‌పై రక్తంతో పడి ఉన్నాడు. ఆ తర్వాత అధికారులు అతని చొక్కా, ప్యాంటును కూడా తీసివేసారు.
అయితే ఆ రాత్రి తర్వాత బ్రూక్స్ చనిపోయాడు. ఇక వీడియోలో అతన్ని కొట్టినట్టు మాత్రమే కనిపిస్తున్నా ఆడియో మాత్రం వినిపించడం లేదు. దీని వెనుక కారణాలు తెలియడం లేదు. ఇక ఈ ఖైదీ మరుసటి రోజు యుటికాలోని ఆసుపత్రిలో మరణించాడు. దీనికి సంబంధించి FBI విచారణ చేపట్టింది. డిసెంబరు 9న మార్సీ కరెక్షనల్ ఫెసిలిటీలో జరిగిన సంఘటనపై రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం, అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్, FBI దర్యాప్తు చేస్తున్నాయి.
ఇక ఈ ఘటనలో ప్రమేయం ఉన్న CO లను వేతనాలు లేకుండా సస్పెండ్ చేయాలని, విధుల నుంచి తొలగించాలి అని, న్యాయస్థానంలో విచారించాలని, దోషులుగా తేలితే అత్యున్నత స్థాయి శిక్ష విధించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏజెన్సీలు మార్పు కోరుతున్నాయి. ఇక యునైటెడ్ క్రిస్టియన్ లీడర్‌షిప్ మినిస్ట్రీ ఆఫ్ వెస్ట్రన్ న్యూయార్క్ ప్రభుత్వం మొదట మార్సీ కరెక్షనల్‌పై దర్యాప్తు చేయాలని కోరింది.
ముఖ్యంగా నల్లజాతి వ్యక్తుల పట్ల పోలీసులు. జైలు క్రూరత్వం వంటి సమస్యలతో దేశం పోరాడుతూనే ఉన్నందున ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2020లో జార్జ్ ఫ్లాయిడ్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద సంఘటనల తర్వాత జాతి న్యాయం, జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తూ జాతీయ నిరసనలకు దారితీశాయి. ఈ తాజా సంఘటన తర్వాత ఆందోళనలు మరింత మిన్నంటాయి.