https://oktelugu.com/

Vidaamuyarchi Movie: తమిళ హీరో అజిత్ ‘విడాముయార్చి’ చిత్రం విడుదల వాయిదా..ఆర్ధిక సమస్యలతో నిర్మాత అష్టకష్టాలు!

 ఈ ఏడాది భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోల సినిమాలలో ఒకటి తమిళ హీరో అజిత్ నటించిన 'విడాముయార్చి'.జనవరి 10వ తేదీన విడుదల అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని ఆర్ధిక లావాదేవీల సమస్య కారణంగా ఈ చిత్రం వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Written By:
  • Vicky
  • , Updated On : December 31, 2024 / 11:42 PM IST
    Follow us on

    Vidaamuyarchi Movie:  ఈ ఏడాది భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోల సినిమాలలో ఒకటి తమిళ హీరో అజిత్ నటించిన ‘విడాముయార్చి’. అజిత్ నుండి దాదాపుగా రెండేళ్ల తర్వాత విడుదల అవుతున్న చిత్రమిది. ఈ సినిమా అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. జనవరి 10వ తేదీన విడుదల అని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. కానీ కొన్ని ఆర్ధిక లావాదేవీల సమస్య కారణంగా ఈ చిత్రం వాయిదా వేస్తున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో అజిత్ అభిమానులు తీవ్రమైన అసంతృప్తి ని వ్యక్తం చేస్తున్నారు. దర్శక నిర్మాతలపై మండిపడుతున్నారు. ఎందుకంటే ఓవర్సీస్ లో ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో మొదలైంది. నార్త్ అమెరికా లో నిన్ననే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. యునైటెడ్ కింగ్డమ్ లో కూడా టికెట్స్ అమ్మకం మొదలు పెట్టారు. అలా మొత్తం మీద ఓవర్సీస్ లో మూడు వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.

    రేపు లేదా ఎల్లుండి తమిళనాడు లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తారని అప్డేట్ వచ్చింది. అభిమానులు సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ వాయిదా వార్త కొత్త సంవత్సరం అజిత్ అభిమానులకు తీవ్రమైన నిరాశని కలిగించేలా చేసింది. మరోపక్క రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ సినిమా వాయిదా పడినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే తమిళనాడు లో ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సోలో రిలీజ్ పండింది. అక్కడి ఆడియన్స్ కి సంక్రాంతి పండుగకు థియేటర్స్ కి వెళ్ళడానికి ‘గేమ్ చేంజర్’ తప్ప మరో ఛాయస్ లేదు. దీంతో సరైన ట్రైలర్ కట్ పడితే తమిళ నాడు బాక్స్ ఆఫీస్ నుండి ఈ చిత్రానికి 12 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు మొదటి రోజే వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి వాయిదా పడిన అజిత్ ‘విడాముయార్చి’ చిత్రం ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది అని సోషల్ మీడియా లో అభిమానులు చర్చించుకుంటున్నారు.

    మేకర్స్ ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. అదే విధంగా శివరాత్రి కి కూడా విడుదల చేసే ప్లాన్స్ ఉన్నాయి. ఈ రెండు తేదీలలో ఎదో ఒకరోజు ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రం ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను కొల్లగొడుతుందని, అజిత్ కెరీర్ లోనే కాకుండా, తమిళ సినిమా ఇండస్ట్రీ లోనే ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుందని బలమైన నమ్మకం తో ఉంది మూవీ టీం. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించగా, యాక్షన్ కింగ్ అర్జున్, రెజీనా విలన్స్ గా నటించారు. హాలీవుడ్ లో అప్పట్లో విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన బ్రేక్ డౌన్ కి ఈ చిత్రం రీమేక్ గా తెరకెక్కిడని ఒక టాక్ ఉంది.