https://oktelugu.com/

New Year 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఎవరు చేశారు?

చాలా మంది ఈ న్యూ ఇయర్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇదంత కొత్త కల్చర్ అని, కొత్త సంవత్సరం అంటే ఉగాది అని అంటారు. అసలు కొందరు ఈ న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోరు. ఇంతకీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా? ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఎందుకు ఈ న్యూ ఇయర్‌ను జరుపుకునే వారో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2024 / 10:36 PM IST

    New Year 2025(4)

    Follow us on

    New Year 2025: ప్రపంచంలోని కొన్ని దేశాలకు ఇప్పటికే న్యూ ఇయర్ వచ్చేసింది. భారత్‌కి కొన్ని గంటల ముందు కొన్ని దేశాలు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాయి. చాలా మంది ఈ న్యూ ఇయర్‌ను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఇదంత కొత్త కల్చర్ అని, కొత్త సంవత్సరం అంటే ఉగాది అని అంటారు. అసలు కొందరు ఈ న్యూ ఇయర్‌ను సెలబ్రేట్ చేసుకోరు. ఇంతకీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా? ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? ఎందుకు ఈ న్యూ ఇయర్‌ను జరుపుకునే వారో తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

    న్యూ ఇయర్ వేడుకలు ఇప్పుడు కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటున్నారని కొందరు అంటుంటారు. కానీ ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యాయట. ఏడాది ప్రారంభంలో ఈజిప్టులోని నైలు నది వరదలు వచ్చినప్పుడు సిరియస్ నక్షత్రం కనిపిస్తుంది. అప్పుడు పర్షియన్లు, ఫోనిషియన్లు కొత్త ఏడాదిని విషువత్తుల సమయంలో ప్రారంభించారు. విషవత్తులు అంటే సూర్యుడు భూమధ్యరేఖపై నేరుగా ఎక్కువ లేదా తక్కువ సమయం మాత్రమే ఉంటాడు. అప్పుడు రాత్రి, పగలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. మార్చి 20వ తేదీన విషవత్తులు వస్తాయి. పురాతన మెసొపొటేమియాలోని బాబిలోన్ నగరంలో 4,000 సంవత్సరాల క్రితం మొదటి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఇలా వసంత విషువత్తుల తర్వాత మొదటి అమావాస్య రోజున బాబిలోనియన్లు ఫస్ట్ వేడుకలను నిర్వహించారు. వారు ఈ పండుగను అకితు అని పిలిచేవారు. అకితు అనే పదాన్ని సుమేరియన్లు బార్లీకి ఉపయోగించేవారు దాని నుంచి వచ్చిందే ఈ పేరు. వసంత ఋతువులో మెసొపొటేమియాలో బార్లీ పంట వచ్చేది. దీంతో అకితు అని పేరు పెట్టారు. ఈ సమయంలో వారు 11 రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. రోజుకో ఆచారం ఉంటుంది. నగర వీధుల నుంచి దేవతల విగ్రహాలను తీసుకు వెళ్తారు. ఇలా బాబిలోనియన్లు కొత్త సంవత్సరం వేడుకలు ప్రారంభించారు.

    న్యూ ఇయర్ పండుగ అనేది కొత్తగా వచ్చిన ఫ్యాషన్ కాదు. నాలుగు వేల సంవత్సరాల నుంచి ఉంది. అయితే అప్పట్లో కొత్త సంవత్సరం ఎన్నో ప్రారంభాలకు శుభంగా భావించి జరుపుకునేవారు. కానీ ప్రస్తుతం రోజుల్లో న్యూ ఇయర్ అర్థమే మారిపోయింది. న్యూ ఇయర్ వస్తుందంటే ఇక అందరూ కూడా ఎలా ఎంజాయ్ చేయాలని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. పార్టీలు, డ్యాన్స్‌లు, మద్యం ఇలా జరుపుకుంటున్నారు. కొత్త సంవత్సరాన్ని ఇలా చెడు అలవాట్లతో స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కువగా మద్యం సేవించి యాక్సిడెంట్లు చేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని రూల్స్ పెట్టిన న్యూ ఇయర్ రోజు ఇలాంటివి మాత్రం జరుగుతూనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఒక్కో దేశంలో ఒక్కో సంప్రదాయంతో న్యూ ఇయర్ వేడుకలను ప్రారంభిస్తారు.