సైకిల్ కింద పడి కమలం నలిగిపోతోంది. బీజేపీలోనే ఉంటూ అదే పార్టీని దెబ్బతీస్తున్నారు చంద్రబాబు కోవర్టులు. స్వయంగా అడ్డంగా దొరికేశారు కూడా. ఏపీలో బలపడాలని అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఆ పార్టీలో చేరిన టీడీపీ నాయకులే ఎసరు పెడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ బీజేపీని చావుదెబ్బతీస్తున్నారు. పేరుకు బీజేపీ నేతలు.. పనిచేసేది మాత్రం టీడీపీ కోసం. ఈ రాజకీయం అర్థం చేసుకోకపోతే.. మేల్కోకపోతే ఏపీపై బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏదో ఒకరోజు వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
*బీజేపీలో టీడీపీ కోవర్టులు?
టీడీపీ అధినేత చంద్రబాబు గెలిచినా.. ఓడినా.. ఆయన కోటరీ మాత్రం చెక్కు చెదరకుండా కొనసాగుతోందని.. అందుకే అధికార వైసీపీని అన్ని వైపుల నుంచి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో ఉంది. బీజేపీతో ఎన్నికలకు ముందు తొడగొట్టినా.. బాబు ఇప్పుడు అదే బీజేపీని శరణు వేడుతున్నారు. బీజేపీని శాంతపరచడానికి తన అనుంగ అనుచరులు అయిన టీడీపీకి బ్యాక్ బోన్ గా ఉన్న నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలను పల్లెంలో పెట్టి మరీ బీజేపీలోకి సాగనంపారు. వారు బీజేపీలోనే ఉన్న చంద్రబాబు, టీడీపీ కోసమే పనిచేస్తున్నారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఎందుకంటే తాజాగా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో టీడీపీ ఫైట్ చేస్తున్న ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి, మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ భేటి కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ అధికారంలో లేనప్పటికీ.. త్వరలో తిరిగి అధికారంలోకి రాలేకపోయినప్పటికీ బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తూనే ఉందనే ఈ ఘటనతో తేటతెల్లమైంది. అయితే నిమ్మగడ్డతో భేటి అయ్యింది బీజేపీ నేతలు.. పనిచేస్తుంది టీడీపీ కోసం.. ఇక్కడే బాద్నం అవుతున్నది బీజేపీ కాగా.. లాభపడుతున్నది మాత్రం టీడీపీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీలో ఉంటూ టీడీపీ కోసం పనిచేస్తూ ఉన్నంత కాలం ఏపీలో బీజేపీకి అవకాశాలుండవు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై కోర్టుల్లో పిటీషన్లు దాఖలు వేళ బీజేపీ లో ఉన్న చంద్రబాబు కోవర్టుల ప్రేమ బయటపడింది. రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై హైకోర్టుకు ఎక్కింది ఎవరో కాదు.. మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్. రాజ్యాంగ పదవుల గౌరవాన్ని పరిరక్షించాలనే నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించాడు. తనకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అనుమతి ఉందని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డాకు ఈ విషయం తెలుసనని పేర్కొన్నాడు.
ఇక ఇప్పుడు సుజనా చౌదరి సంగతి. సుజనా బీజేపీలో చేరినా మనసంతా చంద్రబాబు చుట్టూనే తిరుగుతుంటుంది. బీజేపీలో చేరాక కూడా చంద్రబాబుపై ఈగ వాలనీయకుండా కాపుకాస్తుంటాడనే పేరు సుజనా చౌదరికి ఉందంటారు. టీడీపీకి మొదట ఆర్థిక అండగా ఉన్న ఆయన బాబు ఓడిపోగానే మోడీ పంచన చేరాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అయినా ఇప్పటికీ సుజనా మనసు టీడీపీపైనే ఉంటుందంటారు. బాబుకు, టీడీపీకి ఏమైనా జరిగితే తను బీజేపీలో ఉన్న సంగతి కూడా మర్చిపోయి మీడియా ముందు రచ్చ చేస్తుంటాడు సుజనా అనే అపవాదు ఉంది.
అయితే తాజాగా ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జగన్ ప్రభుత్వం చేత తొలగించబడ్డ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం సెగలు కక్కుతోంది. ఆయన ఇష్యూ సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. తిరిగి నియమించాలని జగన్ ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రస్తుతం విచారణ సాగుతోంది. కానీ సీఎం జగన్ మాత్రం ఆయన నియామకాన్ని సహించడం లేదు. టీడీపీకి ఫేవర్ గా నిమ్మగడ్డ పనిచేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నిమ్మగడ్డ వ్యవహారం పీక్ స్టేజీలో ఉండగానే తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రాంగం చర్చనీయాంశమైంది. తాజాగా హైదరాబాద్ లోని ప్రముఖ పార్క్ హయాత్ హోటల్ లో నిమ్మగడ్డ రమేశ్ తాజాగా బీజేపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తో గంటన్నర సేపు జరిపిన రహస్య భేటి. సుజనా, కామినేనిలు ఇద్దరూ చౌదరీలే.. ఒకే సామాజికవర్గం. అదీ చంద్రబాబుకు రైట్ హ్యాండ్స్. సో బీజేపీలో ఉన్న ఈ ఇద్దరు నిమ్మగడ్డను కాపాడడానికి మంత్రాంగం నడిపారు. నిమ్మగడ్డ వైసీపీని ఎదురిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాగా..మిగిలిన ఇద్దరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రజాప్రతినిధులు. కానీ టీడీపీ కోసం పనిచేస్తున్నారు.
* బీజేపీ కళ్లు తెరవాల్సిన టైం వచ్చిందా?
ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీని ఇప్పుడు టీడీపీనే దెబ్బతీస్తోందని అర్థమవుతోంది. బీజేపీలోని చంద్రబాబు కోవర్టులు ఆ పార్టీలోనే ఉంటూ టీడీపీ కోసం చేస్తున్నారని తేటతెల్లమైంది. ఇలాంటి నేతలతో రాజకీయం చేస్తున్న బీజేపీ ఏపీలో ఎలా ఎదుగుతుందని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఏపీలో అధికారం రాకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే శాపంగా మారింది. సరైన నడిపించే నాయకుడు, దిశానిర్ధేశకుడు లేక బీజేపీ ఏపీలో నిలబడలేకపోతోంది. ఇప్పుడు కమ్మ నాయకుల చేతిలో మరోసారి బలిపశువు అవుతుందన్న చర్చ సాగుతోంది. బీజేపీ ఇలా కోవర్టులను తరిమికొట్టి అనాదిగా బీజేపీ వెంట ఉంటున్న కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులను దరికి చేర్చుకొని వారికి పార్టీలో మంచి పదవులు ఇస్తే ఖచ్చితంగా బీజేపీ ఏపీలో నిలబడుతుందని అంటున్నారు. కానీ అవేవీ చేయకుండా కమ్మలనే నెత్తిన పెట్టుకుంటే బీజేపీని… టీడీపీ 2గా పిలుస్తారు తప్పితే సొంత గుర్తింపు అస్సలు దక్కదంటున్నారు.
* బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకోవలి..
బీజేపీ ఖచ్చితంగా ఏపీలో ఓటు బ్యాంకును పెంచుకోవాలి.. నమ్ముకున్న కాపు, బ్రాహ్మణ, వైశ్య వర్గాలకు పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వైసీపీకి రెడ్లు, టీడీపీకి కమ్మలు ఎలా అయితే బలంగా సపోర్టు చేస్తున్నారో అలానే.. బీజేపీ కాపు, బ్రహ్మ, వైశ్యలను అక్కున చేర్చుకోవాలి. అప్పుడే ధీటుగా నిలబడగలం.. ఇక బీజేపీ రాష్ట్ర రాజకీయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా వెనుకుండి నడిపిస్తున్నారన్న అనుమానాలను ఆ పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఇది ఆయన వర్గాల వారికే లబ్ధి చేకూరుస్తుందని.. టీడీపీకి ఫేవర్ గా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. మొత్తంగా అందరూ కలిసి బీజేపీ పుట్టిని ఏపీలో ముంచుతున్నారని అర్థమవుతోంది. బీజేపీ కళ్లు తెరవకపోతే పుట్టిమునగడం ఖాయమంటున్నారు. ఎవరు తమ వారు.? ఎవరు కాదన్నది ముందు తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
-ఎన్నం
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Will chandrababus kotari disrupt bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com