New Zealand Vs India: రోహిత్ శర్మ పై ఇటీవల కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ లావుగా ఉంటారని.. ఆయనకు శరీర సామర్థ్యం అంతగా ఉండదని.. మైదానంలో వేగంగా పరుగులు తీయలేడని.. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ తో పోల్చి చూస్తే ఆయన పెద్ద గొప్ప ఆటగాడు కాదని విమర్శలు చేశారు.
Also Read: ఫైనల్లో ఇండియా విక్టరీ.. స్టేడియంలోనే దాండియా ఆడిన రోహిత్-విరాట్
షామా మహమ్మద్ చేసిన విమర్శలు క్రికెట్ వర్గాలను షాక్ కు గురిచేశాయి. వెంటనే టీమిండియా మాజీ సీనియర్ ఆటగాళ్లు షామా మహమ్మద్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఒక ఆటగాడి గురించి మీకేం తెలుసని అలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఒక జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పుడు కెప్టెన్ పై ఎంత ఒత్తిడి ఉంటుందో షామా మహమ్మద్ తెలుసుకోవాలని.. చురకలు అంటించారు..షామా మహమ్మద్ బాధ్యత గల కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి అయి ఉండి.. ఇలాంటి మాటలు మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు. వెంటనే ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జాతీయ మీడియా కూడా షామా మహమ్మద్ పై అటాక్ మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఒక టీమ్ ఇండియా కెప్టెన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని అభిప్రాయపడింది. రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామి అయితే ఏకంగా షామా మహమ్మద్ సిగ్గుమాలిన పని చేశారని ఆరోపించారు. ఒక లెజెండ్రి టీమిండియా కెప్టెన్ ను అలా విమర్శించడం ఆమె చేస్తున్న నీతి మాలిన రాజకీయాలకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి ది రాజకీయాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ వరుసగా ఓటములు ఎదుర్కొందని.. మరి అలాంటి నాయకుడిని ఏమని పిలవాలని గోస్వామి షామా మహమ్మద్ ను ప్రశ్నించారు.
View this post on Instagram
సరిగ్గా బదులు చెప్పిన బిజెపి
షామా మహమ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బిజెపి స్పందించింది. దుబాయ్ వేదిక ఆదివారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో భారత్ గెలవడం.. అందులో రోహిత్ శర్మ కీలకమైన ఇన్నింగ్స్ ఆడటంతో.. బిజెపి స్పందించింది. షామా మహమ్మద్ కి గట్టి కౌంటర్ ఇచ్చింది.. పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అనే డైలాగ్ స్టైలో అన్ఫిట్ సమ్ జా క్యా.. సూపర్ హిట్ హై మై అని క్యాప్షన్ జత చేసింది. అల్లు అర్జున్ స్థానంలో రోహిత్ శర్మ ఫేస్ ను జత చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. షామా మహమ్మద్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ అదిరిపే రేంజ్ లో బ్యాటింగ్ చేయడంతో.. నిన్న రాత్రి నుంచి రోహిత్ అభిమానులు షామా మహమ్మద్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.షామా మహమ్మద్ రోహిత్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అతడి అభిమానులు వెంటనే ప్రతిస్పందించారు. ట్విట్టర్లో కాంగ్రెస్ కా బాప్ రోహిత్ అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు.
Also Read: టీమ్ ఇండియా గెలిచిన వేళ.. ఆరు పదుల వయసులో స్టెప్పులు వేసిన సునీల్ గవాస్కర్..
’ !#ChampionsTrophy2025 #RohitSharma pic.twitter.com/CzclJlb8VF
— BJP (@BJP4India) March 9, 2025