RK kothapaluku
RK kothapaluku : తాజాగా ఆదివారం తన పత్రిక లో రాసిన కొత్త పలుకులో రాధాకృష్ణ ఏం చెప్పాడయ్యా అంటే.. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి రెండు స్థానాలు గెలుచుకుంది. క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంది కాబట్టి ఇకపై బీజేపీ ఊరుకోదు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. వచ్చే నాలుగు సంవత్సరాలలో ఇది జరిగి తీరుతుంది. ఇందులో జనసేన, టిడిపి ముఖ్యపాత్ర పోషిస్తాయి. తెలంగాణలో ఎప్పటినుంచో రాజకీయాలు చేయాలని చంద్రబాబు ఆశపడుతున్నారు. ఇక వచ్చే ఎన్నికలలో అది జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ నుంచి బిజెపి అధిష్టానానికి వర్తమానం వెళ్ళింది. కానీ బిజెపి అధిష్టానం ఒప్పుకోకపోవడంతో కెసిఆర్ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ కు ఇబ్బందికరంగా మారితే.. రేవంత్ రెడ్డికి ఆశనిపాతంగా మారాయి. కెసిఆర్ మాత్రమే కాదు రేవంత్ కూడా మేలుకోవాలి. లేకపోతే కష్టకాలం ఎదురుగాక తప్పదు.. ఇలా సాగిపోయింది రాధాకృష్ణ విశ్లేషణ.
Also Read : కేసీఆర్, ఆర్కే మధ్య మనస్పర్ధలు తొలగిపోయినట్టేనా?!
సాధ్యమవుతుందా
రాధాకృష్ణ చెప్పినట్టుగానే క్షేత్రస్థాయిలో బీజేపీ బలం పెంచుకుంటున్నది. అలాగని భారత రాష్ట్ర సమితి ఊరుకోవడం లేదు. ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీష్ రావు, కవిత కాలికి బలపం కట్టుకుని తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. అయితే ప్రజల్లో ఇంకా ఆగ్రహం చల్లారలేదు, పదేళ్ల పాలన తాలూకు ఇబ్బందులు ఇంకా కనిపిస్తున్నాయి కాబట్టి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాకపోతే దీని డైవర్ట్ చేయడానికి కేటీఆర్, హరీష్ రావు, కవిత ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులకు సపోర్ట్ చేశారని వాదన కూడా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్లో చోటుచేసుకుంటున్న కుమ్ములాటలు కూడా బిజెపికి లాభం చేకూర్చుతున్నాయి. అందువల్లే ఆ పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచింది. అంతకు ముందు జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 స్థానాలలో సొంతం చేసుకుంది. మొత్తంగా చూస్తే బిజెపిలో కమలం పార్టీ తన బలం పెంచుకుంటున్నది. అయితే ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎన్డిఏ ద్వారా విజయం సాధించాలని బిజెపి భావిస్తుందని రాధాకృష్ణ చెబుతున్నారు. ఇదే వ్యాసంలో ఆయన తెలంగాణలో బిజెపికి బలం ఉందని రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోల్చితే తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి అడ్వాంటేజ్ ఉందని చెప్పారు. అలాంటప్పుడు టిడిపి, జనసేనతో బిజెపి ఎలా కలుస్తుంది? ఏపీ ఫార్ములాను ఇక్కడ ఎందుకు అమలు చేస్తుంది? తెలంగాణలో టిడిపికి బలం ఉంటే ఎన్నికల్లో పోటీ చేసేది కదా? 2019 ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని పోటీ చేస్తే ఎలాంటి ఫలితం వచ్చిందో రాధాకృష్ణకు తెలియదా? 2023 ఎన్నికల్లో కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి పోటీ చేస్తే.. పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేస్తే.. ఏం జరిగిందో రాధాకృష్ణకు గుర్తు లేదా? రాధాకృష్ణ రాసిన వాటిల్లో ఒక్కటి మాత్రం నిజం.. కెసిఆర్ బిజెపి పెద్దలకు అందుబాటులోకి వెళ్తే వారు కాదన్నారు. అందుకే జనంలోకి వస్తున్నారు.. కెసిఆర్ ఇప్పుడే కాదు తన కాలు విరిగినప్పుడు.. కట్టె పట్టుకుని జనాల్లోకి వచ్చినప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఫలితం ఎలా వచ్చిందో అందరికీ తెలుసు.. అలాంటప్పుడు కెసిఆర్ ఎప్పుడు జనాల్లోకి వచ్చి నేనున్నాను.. నిన్ను విన్నాను అంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రేవంత్ రెడ్డికి కూడా ఒక రకంగా షాక్ లాంటివే. కాకపోతే ఈ ఓటమి నుంచి రేవంత్ రెడ్డి ఎలాంటి పాఠాలు నేర్చుకుంటారనేదే ఆసక్తికరం. పది సంవత్సరాలపాటు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్.. అనేక పోరాటాలు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి వ్యక్తి అధికారాన్ని అంత త్వరగా ఎలా వదులుకుంటాడు.. ఎన్డీఏ కూటమి వస్తే చంద్రబాబును సైతం ప్రశ్నించకుండా ఎలా ఊరుకుంటాడు.. ఈ చిన్న లాజిక్ ను రాధాకృష్ణ ఎలా మిస్ అయ్యాడు.. పాపం రోజు రోజుకు రాధాకృష్ణ రాతలు పిడిఎఫ్ పేపర్ కంటే దిగజారి పోతున్నాయి.
Also Read : ఆర్కే సార్ కు రాజకీయ పార్టీల ఉచితాలపై కోపం వచ్చింది.. అప్పుడు సూపర్ సిక్స్ పై మీరేమన్నారో గుర్తుందా సార్?
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rk kothapaluku kcr people issues pdf articles
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com