Viral Wedding Video : మనదేశంలో సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పకడ్బందీగా పాటించే రాష్ట్రాలలో రాజస్థాన్ ముందు వరుసలో ఉంటుంది. పేరుకు ఎడారి రాష్ట్రమైనప్పటికీ.. ఇక్కడ వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. ఎడారి మాత్రమే కాకుండా నీటి వనరులు, దట్టమైన అరణ్యాలు రాజస్థాన్లో విస్తారంగా ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా పంటలు విస్తారంగా పండుతుంటాయి. సంప్రదాయ మిఠాయిల తయారీ వ్యాపారం కూడా ఇక్కడ జోరుగా సాగుతూ ఉంటుంది. ఇక రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారంతా ఎక్కువగా వ్యాపారాలలో స్థిరపడుతూ ఉంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో వ్యాపారాలు సాగిస్తూ.. వివాహ వేడుకలు.. ఇతర పండుగల సమయంలో సొంతప్రాంతానికి వస్తుంటారు. సొంత ప్రాంతానికి వచ్చినప్పుడు తమ స్థాయిని, దర్పాన్ని, ఆర్థిక నేపథ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. సంప్రదాయాల విషయంలో.. వేడుకలు ఘనంగా జరిపే విషయంలో రాజస్థాన్ వాసులు ఏమాత్రం వెనక్కి తగ్గరు. పైగా తమకు తామే సాటి అని నిరూపించుకునే విధంగా చేస్తుంటారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
Also Read : టాప్ టెక్ లీడర్.. ట్యాక్సీ డ్రైవర్ గా.. ఇదీ బెంగళూరులో పరిస్థితి!
ఇటీవల రాజస్థాన్ రాష్ట్రంలో తన చెల్లికి కాబోయే భర్తకు ఆమె సోదరులు 21 కోట్ల ఆస్తిని కట్నంగా ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అప్పట్లో ఆ వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏకంగా తమ సోదరికి కాబోయే భర్తకు ఆమె అన్నదమ్ములు భారీగా కట్న కానుకలు ఇచ్చారు. వివాహ వేడుకలో భాగంగా 1.3 కోట్ల విలువైన 500 నోట్ల దండను అతని మెడలో వేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆ దండ అతని మెడ మీద వేయడానికి.. మూడు అంతస్తుల భవనం పైకి తీసుకెళ్లారు. నోట్ల దండతో పాటు అత్యంత ఖరీదైన బంగారపు హారం కూడా అతడి మెడలో వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది..” డబ్బు వీళ్లకు అత్యంత సులువుగా వస్తోంది అనుకుంటా. లేకపోతే ఈ స్థాయిలో 500 నోట్ల కట్టలతో దండలు రూపొందించి వేయడం అంటే మామూలు విషయం కాదు. అది వారి సోదరి మీద ఉన్న ప్రేమను సూచిస్తోంది. ఇలాంటి వ్యవహారం కొంతమందికి ఇబ్బంది కలిగించినప్పటికీ.. ప్రేమ అనేది అన్నిటినీ జయిస్తుందని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ప్రకారం ఆ పెళ్ళికొడుకు వ్యాపారం చేస్తుంటాడని.. అతడికి భారీగానే ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక పెళ్లికూతురు తరుపు వారు కూడా వ్యాపారాలు చేస్తుంటారని.. వారికి కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయని సమాచారం. అందువల్లే వరుడికి ఈ స్థాయిలో కట్నకానుకలు ఇచ్చారని.. తమ ఆర్థిక స్థిరత్వాన్ని ప్రదర్శించారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఈ వివాహ వేడుకలో విందు కూడా అద్భుతమైన స్థాయిలో పెట్టారని చర్చ జరుగుతోంది.