Tata Sierra CNG price: నేటి కాలంలో కార్లు కొనాలని అనుకునేవారు ఎక్కువగా ఎలక్ట్రిక్ వేరియంట్ వైఫై చూస్తున్నారు. ఇవి సౌకర్యవంతంగా ఉండడంతో పాటు పర్యావరణ కాలుష్యం, మైలేజ్ కూడా ఎక్కువగా రావడంతో చాలామంది వీటి వైపు చూస్తున్నారు. అయితే ఇదే సమయంలో Tata కంపెనీకి చెందిన ఓ కారు CNG వేరియంట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటివరకు టాటా కంపెనీ నుంచి పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయినా వీటిని అధిగమించి అధిక మైలేజ్ ఇచ్చేందుకు ఈ సీఎన్జీ కారు రెడీ అయింది. ఇంతకీ ఈ కారు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా?
దేశంలో కార్లను విక్రయించడంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న Tata కంపెనీ నుంచి Sierra ఇప్పటికే మంచి ఆదరణ పొందింది. పెట్రోల్ వేరియంట్ లో ఈ కారును చాలామంది కొనుగోలు చేశారు. అయితే చాలా వరకు కార్లు పెట్రోల్ నుంచి అప్డేట్ అయి ఎలక్ట్రిక్ కార్లుగా మారుతున్నాయి. కానీ ఈ మోడల్ మాత్రం CNG వేరియంట్ లో బెస్ట్ మైలేజ్ ఇచ్చేదిగా పేరు తెచ్చుకుంది. గత ఏడాది టాటా సియర్రా ను 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ టర్బో డీజిల్, వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్ కలిపి మొత్తం మూడు ఎంపికలతో పరిచయం చేసింది. అయితే ఈ కారు తర్వాత EV వస్తుందని చాలామంది అనుకున్నారు. కానీ అంతకుముందే CNG కారు రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ కొత్త కారులో అమర్చిన CNG లో ఫిట్మెంట్ ప్లగ్ అండ్ ప్లే, యూరోప్ గ్యాస్ ఇన్స్టాల్ చేనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అలాగే ఈ CNG కిట్ లో అదనపు కనెక్టర్లు, ఇంజన్ బేస్ లో ఇన్స్టాల్ చేయాల్సిన ECM ఉన్నాయి. ఈ కొత్త CNG అధిక మైలేజ్ ఇచ్చేందుకు రెడీ అయింది. ఇప్పటివరకు ఉన్న పెట్రోల్ Sierra కారు లీటర్ ఇంధనానికి 18.2 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు CNG కిలో ఇంధనానికి 28.8 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీంతో అధిక మైలేజ్ పొందడం మాత్రమే కాకుండా పర్యావరణ రహితంగా కూడా ఈ కారు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే ఈ కారుపై ఆసక్తిగా చర్చ సాగుతుంది. ఈ సీఎన్జీ కారుపై ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం లేదని కొందరు అంటున్నారు. అంతేకాకుండా సిఎన్జి ట్యాంక్ అమరచడం వల్ల కారులో ఎక్కువ స్పేస్ ఉండకపోవచ్చు అని తెలుపుతున్నారు. దీంతో దూర ప్రయాణాలు చేసే వారికి ఇది ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం సిఎన్జి స్టేషన్లు తక్కువగా ఉండడంతో వీటి కొనుగోలుపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడాలి. ఇక ఈ కారును రూ. 11.49 లక్షల నుంచి రూ.21.29 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.