Homeవార్త విశ్లేషణKhaleja Movie Re Release: పాముతో ఖలేజీ థియేటర్ లోకి వచ్చిన మహేష్ అభిమాని.. ఇదేం...

Khaleja Movie Re Release: పాముతో ఖలేజీ థియేటర్ లోకి వచ్చిన మహేష్ అభిమాని.. ఇదేం పైత్యంరా సామీ

Khaleja Movie Re Release: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా రీరిలీజ్ సందర్భంగా అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. విజయవాడలో ఈ సందర్భంగా ఒక విచిత్రమైన ఘటన జరిగింది. ఖలేజా సినిమాలో మహేష్ బాబు పాముతో ఎంట్రీ ఇవ్వడం గుర్తుండే ఉంటుంది. అదే సీన్‌ను అనుసరిస్తూ ఓ అభిమాని నిజమైన పాము పిల్లను తీసుకుని థియేటర్‌లోకి వచ్చాడు.

ప్రేక్షకులు తొలుత అది రబ్బర్ పాము అనుకొని నవ్వుకున్నారు. కానీ అది నిజమైన పాము అని తెలిసిన వెంటనే హాల్‌లో భయభ్రాంతులు నెలకొన్నాయి. దీంతో కొంత కలకలం రేగింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. అభిమానంలో మితి తప్పకూడదని పలువురు సూచిస్తున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version