Heartwarming video: మారుతున్న జీవన విధానం.. ఆహారపు అలవాట్ల కారణంగా క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా వ్యాధిబారిన పడుతున్నారు. ఇక క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌తో జుట్టు ఊడిపోవడం సహజం. తాజాగా ఓ చిన్నారి క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతోంది. దీంతో చిన్నారి జుట్టు ఊడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న సహచర విద్యార్థినులు నీకు మేము తడు ఉన్నామని గొప్ప మనసు చాటుకున్నారు. బాధిత చిన్నారిలో ధైర్యం నింపేందుకు తరగతి గదిలోని చిన్నారులంతా జుట్టు కత్తిరించుకున్నారు. విద్యార్థినుల త్యాగాన్ని చూసి టీచర్ కూడా వారిబాటలో నడిచి ఆదర్శంగా నిలిచారు.
సోషల్ మీడియాలో వైరల్..
విద్యార్థులు అందరూ ఒకేసారి గుండు చేయించుని పాఠశాలకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచరుల మద్దతు చూసిన క్యాన్సర్ బాధిత చిన్నారికి ఎంతో ధైర్యం వచ్చింది. ‘ఇక నేను భయపడను, మా స్నేహితులంతా నాతో ఉన్నారు‘ అని పేర్కొంది. ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. సహచర చిన్నారులను అభినందిస్తున్నారు. క్యాన్సర్ వంటి వ్యాధుల్లో ఒంటరిగా పోరాడాల్సిన బాధితులకు సమాజ సమర్థన ఎంత ముఖ్యమో ఈ చిన్నారులు చూపించారు.
నెటిజన్ల స్పందన..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను నెటిజన్లు లైక్, షేర్ చేస్తున్నారు. ఇదే సమయంలో చిన్నారికి ధైర్యం చెబుతున్నారు. సహచర విద్యార్థులను అభినందిస్తున్నారు. ‘ఇదే నిజమైన మానవత్వం‘ అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీలు, సంస్థలు కూడా స్వీయ ప్రయత్నాలకు ప్రేరణ పొందారు. ఇలాంటి చిన్న చర్యలు గొప్ప మార్పును తీసుకురావచ్చని నిరూపితమైంది.
క్లాస్‌మేట్‌కు క్యాన్సర్.. గుండు చేయించుకున్న విద్యార్థినులు!
క్యాన్సర్ చికిత్సలో జుట్టు కోల్పోయి, స్కూల్‌కు రావడానికి భయపడుతున్న ఒక చిన్నారికి తోటి విద్యార్థులు, టీచర్లు అండగా నిలిచారు. “నువ్వు ఒంటరివి కాదు.. నీ పోరాటంలో మేమంతా నీతోనే ఉన్నాం” అని భరోసా ఇస్తూ వారంతా సామూహికంగా… pic.twitter.com/Z0xUX4wYX7
— ChotaNews App (@ChotaNewsApp) January 19, 2026