Kerala bus viral videos: ఇటీవల కేరళ రాష్ట్రంలో దీపక్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తనను తాకాడని ఓ యువతి సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వాస్తవానికి ఆ వీడియోలో దీపక్ ఆమెను తాకలేదు. కానీ సోషల్ మీడియా వల్ల తన పరువు పోవడంతో దీపక్ ఆత్మ న్యూనతకు గురయ్యాడు. తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
కేరళ రాష్ట్రంలోని గోవిందపురం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. దీపక్ ఆత్మహత్య తర్వాత కేరళ రాష్ట్రంలో మగవాళ్ళకు అనుకూలంగా ఒక ఉద్యమమే మొదలైంది. దీంతో ప్రభుత్వం స్పందించక తప్పలేదు. ఆ సెల్ఫీ వీడియో తీసుకొని.. మహానటి లెవెల్ లో పెర్ఫార్మన్స్ ఇచ్చిన ఆ యువతీని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.. అయితే ఈ ఘటన తర్వాత కేరళ రాష్ట్రంలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి.
బస్సులలో ప్రయాణిస్తున్న పురుషులు చాలా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆడవాళ్ళ పక్కన కూర్చోడానికి ఇష్టపడడం లేదు. ఆడవాళ్లకు దూరంగా జరుగుతున్నారు. కొందరైతే తమ రక్షణ కోసం అట్ట డబ్బాను అడ్డంగా పెట్టుకుంటున్నారు. మగ కండక్టర్లు కూడా భయపడుతూ ఆడవాళ్ళకు టికెట్లు ఇస్తున్నారు.. ఒక వృద్ధుడు అయితే తాను బస్సు ఎక్కిన దగ్గర్నుంచి మొదలు పెడితే దిగేంతవరకు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. బస్సు చివర్లో మాత్రమే నిలబడి ప్రయాణం చేశాడు.
ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. “మగవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. చివరికి బస్సులో ప్రయాణించే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. చేయని తప్పులకు శిక్ష అనుభవించాల్సిన దుస్థితి మగాళ్ళకు దాపురించింది. ఇటువంటి పరిస్థితుల్లో మగవాళ్లు తమ మనుగడ సాగించాలంటే చాలా కష్టం. ఎందుకైనా మంచిది రాష్ట్ర ప్రభుత్వం మెన్స్ కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. లేకపోతే మగవాళ్ళకోసమే ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుంది. అలాకాకుండా ఇలా ప్రయాణాలు చేస్తూ.. చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తూ.. నరకం చూడాలంటే వల్ల కావడం లేదని,” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.
దీపక్ ఘటన తర్వాత కేరళ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వ నడిపే బస్సులలో ఒక రకమైన ఉద్విగ్న వాతావరణం నెలకొన్నది. ఆడవాళ్లు కూడా భయం భయంగానే ప్రయాణాలు సాగిస్తున్నారు. అయితే కొంతమంది మగాళ్లు మాత్రం సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా బస్సు వెనకాల నిలబడి ప్రయాణం చేస్తున్నారు.. మహిళల వైపు కనీసం చూడటం లేదు.. వారికి దగ్గరగా ఉండి ప్రయాణం చేయాలని అసలు అనుకోవడం లేదు.
Kerala Men traveling in bus from today pic.twitter.com/vsvnivkHgk
— Deepu (@deepu_drops) January 19, 2026
Watch : If we get touched, we know to post it on social media too
A Kerala man just flipped the script on buses. pic.twitter.com/zLyzIoX7qa
— Hinduism_and_Science (@Hinduism_sci) January 20, 2026
