spot_img
Homeవైరల్ వీడియోస్Viral Video: 20 మిలియన్ల మంది చూశారు.. ఇంతకీ ఈమె వీడియోలో ఏముంది?

Viral Video: 20 మిలియన్ల మంది చూశారు.. ఇంతకీ ఈమె వీడియోలో ఏముంది?

Viral Video: సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోయిన తర్వాత.. ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్.. ఇలాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఓవర్ నైట్ స్టార్ లు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. ఇలా స్టార్ డం సంపాదించుకోగానే రకరకాల అవకాశాలు వారి తలుపు తట్టాయి. దీంతో దండిగా సంపాదించుకునే అవకాశం ఏర్పడింది. వంట, వ్యవసాయం, సేవ, ట్రావెలింగ్, పాటలు, ఆటలు.. ఇలా ఎన్నో రంగాల్లో తమ ప్రతిభను నిరూపించుకొని సెలబ్రిటీలు అయిన వాళ్ళు చాలామంది.. ఉదాహరణకు కుమారి ఆంటీ నే చూడండి.. జస్ట్ ఆమె తన వంట ద్వారా.. “రెండు లివర్లా 1000 కొట్టండి” అని ఆమె చేసిన కామెంట్స్ ఎక్కడికో తీసుకెళ్లాయి. ప్రస్తుతం మీడియాలోనూ ఆమె కనిపిస్తోంది. పెద్ద పెద్ద టీవీ చానల్స్ లో సందడి చేస్తోంది. సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు లభిస్తున్నాయి.

గత ఏడాది కచ్చా బాదం అనే పాటతో వెస్ట్ బెంగాల్ కు చెందిన ఓ వ్యక్తి ఎంత ఫేమస్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. పచ్చి వేరుశెనక్కాయలు అమ్మడానికి ఆయన రూపొందించిన పాట.. అతడిని ఎక్కడికో తీసుకెళ్ళింది. ఏకంగా సోషల్ మీడియా స్టార్ ను చేసేసింది. ఆ వ్యక్తి వేరుశెనక్కాయలు అమ్ముకునేందుకు పాడిన పాటను ఎవరో రికార్డ్ చేసి.. దానికి కాస్త హంగులు అద్ది సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ఇంకేముంది అది దెబ్బకు ట్రెండింగ్ లోకి వచ్చింది. విపరీతంగా సర్కులేట్ కావడంతో ఆ వ్యక్తికి మంచి పేరు వచ్చింది. విపరీతంగా డబ్బులు రావడంతో ఆయన పేదరికం కొట్టుకుపోయింది. ప్రస్తుతం అతడు ఆర్థికంగా స్థిరపడ్డాడు. పచ్చి శనక్కాయలు అమ్ముకునే స్థాయి నుంచి.. వేగంగా ఒక సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసే దిశగా ఎదిగాడు.

ఇప్పుడు తాజాగా ఇన్ స్టా గ్రామ్ లో “రాజావిన్ పార్వయ్ రాణియిన్ పక్కమ్” అనే పాట సందడి చేస్తోంది. ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ తో వీడియోలు చేయని నెటిజన్లు లేరంటే అతిశయోక్తి కాదు. ఇదే మ్యూజిక్ తో మహిళ రోడ్డుపై నడుస్తూ డ్యాన్స్ చేసింది. ఆ పాటకు తగ్గట్టుగానే హావ భావాలను ప్రదర్శించింది. ఈ వీడియోను తీసిన ఓ యువకుడు అద్భుతంగా ఎడిట్ చేశాడు. దీనిని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. దీంతో 20 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఏకంగా 1.60 లక్షల మంది లైక్ కొట్టారు. ” ఆ మహిళ చేస్తున్న డ్యాన్స్ సరికొత్తగా ఉంది. ఆ పాటకు తగ్గట్టుగా ఉంది. ఎలా వస్తాయి రా బాబు ఇలాంటి ఐడియాలు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version