Transgenders: హిజ్రాలకు శ్రీ రాముల వారు ఇచ్చిన వరం ఇదే..

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా అంగరంగా వైభవంగా జరుగుతుంటుంది.

Written By: Neelambaram, Updated On : April 1, 2024 2:18 pm

Know the boon given to transgenders by Lord Rama

Follow us on

Transgenders: వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారా ఎప్పుడు అయినా? భక్తులు కోరిన కోరికలు తీర్చే ఆ స్వామి చల్లని చూపు ఉంటే ఆనందం మన వెంటే. రాజరాజేశ్వర స్వామిని నమ్మి ఆరాధించే వారి సంఖ్య ఎక్కువనే ఉంటుంది. అక్కడ ప్రతి రోజు భక్తులతో ఆలయం కిటకిట లాడుతుంటుంది. అయితే ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన ఓ విషయాన్ని తెలుసుకుందాం.

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి సన్నిధిలో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇక్కడ సీతారాముల కళ్యాణం కూడా అంగరంగా వైభవంగా జరుగుతుంటుంది. ఈ పర్వదినాన దేశంలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, శివసత్తులు, జోగినిలు, హిజ్రాలు వస్తుంటారు. ఆ స్వామి వారి దివ్య కళ్యాణాన్ని చూస్తూ వారి సేవలో తరిస్తారు.

అయితే శ్రీరామ చంద్ర ప్రభు వనవాసం వెళ్లే సమయంలో అందరినీ తమ ఇల్లల్లోకి వెళ్లాలని ఆజ్నాపిస్తారట రాముల వారు. కానీ హిజ్రాలకు మాత్రం ఏం చెప్పలేదట. దీంతో ఆ రామయ్య ఆజ్ఞ లేకుండా ఇంటికి ఎలా వెళ్లాలి అని ఆయన రాక కోసం ఎదురుచూస్తూ ఉంటారట. ఇక వనవాసం పూర్తి అయిన తర్వాత హిజ్రాల భక్తికి మెచ్చిన రాముల వారు ఓ వరం ఇస్తారట.

ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా మీకు దీవించే శక్తి ఇస్తున్నాను అంటారట. ఇలా స్వామి వారు కరుణించి వారికి వరం ఇవ్వడంతో సంతోషిస్తారట హిజ్రాలు. అయితే ఈ నమ్మకం ఎప్పటి నుంచో ఉంది. మొత్తం మీద దీవించే వరం హిజ్రాలు ఆ రామయ్య వద్ద నుంచి పొందారు అన్నమాట. అందుకే చాలా మంది వీరి దీవెనలు కావాలి అనుకుంటారు.