https://oktelugu.com/

Beera : రేయ్ దారుణం రా ఇది.. బీరకాయలను అలా ఎవరైనా చేస్తారా..

Beers : వెనుకటి రోజుల్లో కూరగాయలు మొత్తం రైతుల పంట పొలంలోనే పండేవి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూడా కూరగాయలు వేసుకునేవారు. అప్పుడే కోసుకొని తాజాగా కూరలు వండుకొని తినేవారు.

Written By: , Updated On : March 20, 2025 / 09:12 AM IST
Beera

Beera

Follow us on

Beera : వెనుకటి రోజుల్లో కూరగాయలు మొత్తం రైతుల పంట పొలంలోనే పండేవి. కొన్ని సందర్భాల్లో ఇంట్లో కూడా కూరగాయలు వేసుకునేవారు. అప్పుడే కోసుకొని తాజాగా కూరలు వండుకొని తినేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పంట పొలాలు కాస్త స్థిరాస్తి వెంచర్లుగా మారిపోయాయి. ఇంట్లో కూరగాయలు పెంచుకుందామంటే కోతు ల దాడి పెరిగిపోయింది. దీంతో కూరగాయల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్లే కూరగాయలకు డిమాండ్ తో పాటు ధర కూడా ఎక్కువగా ఉంటున్నది. దీంతో వినియోగదారులు అధిక ధరకు కూరగాయలను కొనుగోలు చేయాల్సి వస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటంతో క్రిమి సంహారకాల వాడకం ఎక్కువైతున్నది. ఫలితంగా వాటిని ఆహారంగా తీసుకున్న వాళ్లకు రోగాలు వస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో కూరగాయలను ఎలాంటి పద్ధతుల్లో పండిస్తున్నారో ఓ వీడియో బయటికి వచ్చింది. అది చూస్తే చాలామంది నెటిజన్లకు ఒళ్ళు జలదరించింది.

Also Read : బీర్లు తాగేవారికి గుడ్ న్యూస్.. ఇక ఆ సమస్య తీరినట్లే..

ఇంతకీ ఏముందంటే..

సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి బీరపాదుల్లో పిందెలకు ఇంజక్షన్ వేస్తున్నాడు. సహజంగా కూరగాయలు పండించే రైతులు చిన్నచిన్న పిందెల సమయంలోనే మందులు వాడరు. ఎందుకంటే ఆ సమయంలో మందులు వాడితే వాటి అవశేషాలు కూరగాయల్లో ఉంటాయి. అయితే ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం చిన్న చిన్న బీరకాయ పిందెలకు ఇంజక్షన్లు వేస్తున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ పిందెలు కాయలుగా మారుతున్నాయి. రోజుల వ్యవధిలోనే అవి పక్వానికి వస్తున్నాయి. సహజంగా ఒక పిందె కాయగా ఏర్పడాలంటే చాలా సమయం పడుతుంది. పైగా వాటికి ఎరువులు, నీరు సక్రమంగా వేయాలి. డిమాండ్ ఎక్కువగా ఉండడం.. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్న నేపథ్యంలో బీరకాయలకు కృత్రిమత్వాన్ని ఆపాదించే పనిని ఓ వ్యక్తి విజయవంతంగా చేస్తున్నాడు. తన బీర తోటలో కాచిన పిందెలకు ఇంజక్షన్లు వేస్తున్నాడు. అలా ఇంజక్షన్లు వేయడం వల్ల అవి త్వరగానే పక్వానికి వస్తున్నాయి. చూసేందుకు తాజాగా.. ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. వినియోగదారులు కూడా ఆ బీరకాయలను నాణ్యమైనవని భావించి త్వరగా కొనుగోలు చేస్తున్నారు.. అయితే బీరకాయలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలోనే ఆ వ్యక్తి అలాంటి పని చేసినట్టు తెలుస్తోంది. తాజాగా పిందెలకు ఇంజక్షన్లు ఇస్తే త్వరగానే పక్వానికి వస్తాయి. సహజ సిద్ధంగా పండిన బీరకాయలు పక్వానికి రావడానికి దాదాపు రెండు వారాల సమయం పడుతుంది. కానీ ఇలా ఇంజక్షన్లు వేయడం ద్వారా రోజుల వ్యవధిలోనే బీరకాయలు కోతకు వస్తాయి. అయితే ఇలాంటి బీరకాయలు తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందువల్లే కూరగాయలు కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. అంతేకాదు ఇలాంటి విధానాలలో పండించిన బీరకాయలను తినకపోవడం మంచిది. ఒకవేళ వాటిని గనక తింటే రకరకాల అనారోగ్య సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక రుగ్మతలకు దారితీస్తాయి.

Also Read : కొత్త బీర్లు మరికొన్ని రోజులు ఆగాల్సిందే… జాప్యం ఎందుకంటే..