New Beers: కొత్త బీర్లు మరికొన్ని రోజులు ఆగాల్సిందే… జాప్యం ఎందుకంటే..

రాష్ట్రంలోని ఆరు బ్రేవరీలలో ఒక షిఫ్టులో మాత్రమే బీర్లు ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం అనుమతి ఉంది. పెరుగుతున్న డిమాం్డ కారణంగా బ్రేవరీలు మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి కోసం నిర్ధిష్టమైన ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవచ్చు.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 11:20 am

New Beers

Follow us on

New Beers: తెలంగాణలో బీర్ల కొరత రోజు రోజుకూ పెరుగుతోంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతుండడంతో మందుబాబులు బీర్ల కోసం మద్యం షాపులకు క్యూ కడుతున్నారు. షాపులు తెరిచిన గంటలోపే బీర్లు అయిపోతున్నాయి. దీంతో మధ్యాహ్నం తర్వాత బీర్లు దొరకడం లేదు. రాష్ట్రంలో ఉన్న ఆరు బ్రేవరీలు డిమాండ్‌కు తగినట్లుగా బీర్లు ఉత్పత్తి చేయకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.

ఒక షిఫ్టుకే అనుమతి..
రాష్ట్రంలోని ఆరు బ్రేవరీలలో ఒక షిఫ్టులో మాత్రమే బీర్లు ఉత్పత్తి చేయడానికి ప్రస్తుతం అనుమతి ఉంది. పెరుగుతున్న డిమాం్డ కారణంగా బ్రేవరీలు మూడు షిఫ్టుల్లో ఉత్పత్తి కోసం నిర్ధిష్టమైన ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవచ్చు. ఈమేరకు అనుమతి కూడా లభిస్తుంది. అయితే ఆరు బ్రేవరీలలో ప్రస్తుతం 95 శాతం మార్కెట్‌ను నాలుగు బ్రాండ్‌లు మాత్రమే ఆక్రమించాయి.

ఉత్పత్తి తగ్గింపు..
డిమాండ్‌ ఉన్న బ్రాండ్ల బ్రేవరీలు.. బీర్ల ఉత్పత్తి పెంచడానికి అనుమతి తీసుకున్నాయి. ఇవి నాలుగు రోజుకు ఒక షిఫ్టలో 1.66 లక్షల కేసులను ఉత్పత్తి చేస్తున్నాయి. రోజుకు 4.98 లక్షల కేసుల బీర్లు తయారు చేసే సామర్థ్యం ఉంది. అయితే ఉత్పత్తిని తగ్గించి మూడు షిఫ్టుల్లో కేవలం 2.5 లక్షల కేసులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాయి.

కొత్త బ్రాండ్లకు అనుమతి..
తెలంగాణలో బీర్ల కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు కొత్త బ్రేవరీలకు అనుమతి ఇచ్చింది. నాలుగు నెలల్లో బ్రబేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఈ నాలుగు బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది. మధ్య ప్రదేశ్‌కు చెందిన సోమ్‌ కంపెనీ ఈ నాలుగు బ్రాండ్లను ఉత్పత్తి చేయనుంది. కొత్త కంపెనీ ఉత్పత్తి త్వరగా ప్రారంభిస్తే బీర్ల కొతర తీరుతుందని మందుబాబులు ఆశించారు.

ఇప్పట్లో లేనట్లే..
కొత్తగా అనుమతి పొందిన ఐదు కంపెనీలు 27 రకాల బీర్లను మార్కెట్‌లోకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో నాణ్యతపై అనుమానాలు తలెత్తాయి. సోషల్‌ మీడియాలో ట్రోల్స్, మద్యం ప్రియుల నుంచి వస్తున్న వ్యతిరేకత కారణంగా పర్మిషన్లకు బేవరేజెస్‌ కార్పొరేషన్‌ బ్రేక్‌ వేసింది. దీంతో కొత్త బ్రాండ్లు వస్తే బీర్ల కొరత తీరుతుందనుకున్న బీరు ప్రియుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.