Beers: వాతావరణం చాలా వేడిగా ఉంటే చల్లబడాలని కోరుకుంటారు. అయితే మద్యం ప్రియులు మాత్రం చల్లటి beer తో cool అవ్వాలని అనుకుంటారు. దీంతో దగ్గరలోని మద్యం షాపులో లేదా బార్ లోకి వెళ్లి బీర్లు సేవించి రిలాక్స్ అవుతారు. ఈ క్రమంలోనే బిర్లా అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో మద్యం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ఒకరకంగా ప్రభుత్వానికి ఆదాయం మద్యం అమ్మకాల ద్వారానే ఎక్కువగా వస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఒత్తిడి వలన లేదా ఇతర కారణాలవల్ల వలన ఏదో రకంగా మద్యం సేవించడం చాలామందికి అలవాటుగా మారింది. వీటిలో బీర్లు తాగే వారే ఎక్కువగా ఉంటున్నారు. వీళ్లకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఇటీవల వీటి ధరలు భారీగా పెరిగాయి. అయినా వాటికి డిమాండ్ తగ్గలేదు. దీంతో బీర్ల కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. ఆ వివరాల్లోకి వెళితే..
సాధారణంగా ఏ వస్తువుకైనా ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది. కానీ మద్యం విషయంలో మాత్రం ఇది వ్యతిరేకంగా ఉంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం బీర్ల ధరను భారీగా పెంచింది. ఆప్పటివరకు రూ. 150 ఉన్న బీరు రూ.180 తో విక్రయిస్తున్నారు. అలాగే రూ.160 తో ఉన్న బీరును రూ.190 తో విక్రయిస్తున్నారు. ఒక్కో బీరుపై రూ. 30 వరకు పెంచారు. బీర్ ధరలు పెరగడంతో వాటికి డిమాండ్ తగ్గుతుందని చాలామంది భావించారు. కానీ ధరలు పెరిగిన మరుసటిరోజే వీటికి డిమాండ్ మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో బీర్ల కంపెనీలు డిమాండ్ కు తగిన విధంగా ఉత్పత్తిని పెంచాలని నిర్ణయించాయి.
రాబోయేది వేసవికాలం కావడంతో బీర్లకు డిమాండ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ధరలు పెంచినప్పటికీ బీర్లను తాగే వారి సంఖ్య ఏమాత్రం తగ్గదని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా బీర్లను ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. ఇప్పటివరకు బీర్ల కంపెనీలో కార్మికులను రెండు షిఫ్టుల్లో మాత్రమే పని చేయించేవారు. కానీ ఇప్పుడు మూడు షిఫ్టులతో బీర్ల ఉత్పత్తిని పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో వచ్చే వేసవిలో బీర్ల కొరత లేనట్లేనని తెలుస్తోంది. కొన్ని రోజుల కింద కింగ్ఫిషర్ కంపెనీకి చెందిన బీర్ మార్కెట్లోకి రావడం ఆగిపోయాయి. ఆ సమయంలో ఇతర కంపెనీల బీర్లు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి. దీంతో కంపెనీ తమ బీర్లను మార్కెట్లోకి తీసుకుపోకపోతే నష్టం కలిగే అవకాశం ఉందని భావించి వెంటనే మళ్ళీ సరఫరా చేసింది.
దీనిని బట్టి తెలుస్తోంది ఏమిటంటే బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉందని.. ధరలు పెంచిన లేదా సరఫరా ఆగిపోయిన బీర్లు కొనే వారి సంఖ్య తగ్గదని కొందరు అంటున్నారు. మరోవైపు బీర్లు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని వైద్యులు చెబుతున్న వీటిని తాగే వారి సంఖ్య తగ్గడం లేదు. గ్రామాలు పట్టణాల్లోనే కాకుండా నగరాల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కువగా వీటిని ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సాధారణ వైన్ షాప్ లో కంటే బార్లలో బీర్లు ఎక్కువగా విక్రయాలు జరుపుకుంటున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ వేసవిలో వీళ్ళ కంపెనీలు ఎంత ప్రాఫిట్ సాధిస్తారో చూడాలి.