Game Changer
Game Changer : రామ్ చరణ్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మంచి విజయాలను సాధిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి. ‘త్రిబుల్ ఆర్’ (RRR) సినిమాతో ‘గ్లోబల్ స్టార్’ (Global Star) గా అవతరించిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో మాత్రం భారీగా దెబ్బతిన్నాడు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ముఖ్య కారణం ఏంటి అనే ధోరణి లో కొన్ని ప్రశ్నలైతే తలెత్తాయి. ఇక ఒక్కొక్కరు ఒక్కో కారణాలు చెబుతుంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన తమన్ (Thaman) మాత్రం ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఒక డిఫరెంట్ కారణాన్ని సమాధానంగా చెప్పాడు. ఇక ఆహా లో టెలికాస్ట్ అవుతున్న ‘డ్యాన్స్ ఐకాన్ 2’ షో కి జడ్జిగా వ్యవహరిస్తున్న తమన్ ఆ షో లో కొంతమంది గేమ్ చేంజర్ సినిమాలోని పాటలకు డాన్సులు వేశారు. దాంతో మీరు వేసిన స్టెప్పులు బాగున్నాయి.
Also Read : ‘గేమ్ చేంజర్’ హిందీ ఓటీటీ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్..5 రోజుల్లో వచ్చిన వ్యూస్ ఎంతంటే!
నిజానికి ఈ సినిమాలో రామ్ చరణ్ అంత మంచి స్టెప్పులు అయితే వేయలేదు అందువల్లే సినిమా ఫ్లాప్ అయింది అంటూ కొన్ని కామెంట్స్ అయితే చేశాడు. నిజానికి సినిమాలో స్టెప్పులు వేయనంత మాత్రాన సినిమాలు ఫ్లాప్ అవుతాయి అనేది మనం ఎప్పుడూ వినలేదు. కానీ తమన్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఇలాంటి సమాధానం చెప్పడం పట్ల చాలా మంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి ఈ సినిమా కొరియోగ్రాఫర్ ప్రభుదేవా (Prabhudeva)… మరి అతని ఇమేజ్ ని దెబ్బ తీయడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేశాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కూడా తను ఇలాంటి కామెంట్స్ చేయడం పట్ల మెగా అభిమానులతో పాటు సినిమా విమర్శకులు సైతం ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ కి చాలా కారణాలు ఉంటే ఫెయిల్యూర్ సాధించడానికి చాలా కారణాలు ఉంటాయి.
కానీ తమన్ మాత్రం కేవలం కొరియోగ్రఫీ బాలేకపోవడం వల్లే సినిమా ఫ్లాప్ అయిందని చెప్పడం అనేది సరైన విషయం కాదు అంటూ వాళ్లు తమన్ మీద సీరియస్ గా ఉన్నారు. ఇక ఏది ఏమైనా కూడా తమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి బాగా హెల్ప్ అయిందని కానీ సినిమా యూనిట్ దాన్ని బాగా వాడుకోలేదనే ఉద్దేశ్యంతో ఇలాంటి కామెంట్స్ చేశాడని కొంతమంది చెబుతున్నారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో రామ్ చరణ్ ఇమేజ్ భారీగా డామేజ్ అయిందనే చెప్పాలి. ఇక ప్రస్తుతం వస్తున్న కామెంట్ల వల్ల కూడా రామ్ చరణ్ ఇమేజ్ కొంతవరకు డ్యామేజ్ అయిందనే చెప్పాలి…
Also Read : ‘గేమ్ చేంజర్’ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం అదే అంటూ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్!