Sujeeth
Sujeeth : సినిమా ఇండస్ట్రీలో దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు… ఒక సినిమా సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయిన దానికి పూర్తి బాధ్యత వాళ్లే వహించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి సినిమా విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు…
Also Read : సుజీత్ ను నువ్వు లైఫ్ లో డైరెక్టర్ కాలేవు అన్న ప్రొడ్యూసర్ ఎవరు ఎవరో తెలుసా..?
సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు డైరెక్టర్ అవ్వాలంటే చాలా సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేసి ఆ వర్క్ మొత్తం నేర్చుకున్న తర్వాత దర్శకులుగా మారి మంచి విజయాలను సాధిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రతి ఒక్కరు దర్శకులుగా వాళ్ళ లక్కును పరీక్షించుకునే ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే సుజీత్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం మొదట షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకొని ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలను చేసే స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తాడా? లేదా అనే విషయాల పట్ల సరైన అవగాహన లేదు. కానీ మొత్తానికైతే ఈ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు. తను చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెడుతున్నాయి… అయితే సుజీత్ ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి కేవలం రెండు సినిమాలను మాత్రమే రిలీజ్ చేశాడు.
అందులో రెండు కూడా మంచి విజయాలను సాధించినప్పటికి ఆయన సినిమా సినిమాకి మధ్య దాదాపు 5 సంవత్సరాల గ్యాప్ అయితే వస్తుంది. అనుకోకుండా ఆయన బాహుబలి సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు ప్రభాస్ తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. దానివల్ల ఐదు సంవత్సరాల పాటు ఆగాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓజీ అనే సినిమాను స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఆయన మాత్రం ఆ సినిమాను కంప్లీట్ చేయడం లేదు. మరి తొందర్లోనే ఈ సినిమాను కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సుజీత్ ఓజీ సినిమాకి స్టిక్ అయిపోవడం వల్ల ఆయనకు పెద్ద హీరోల నుంచి వస్తున్న ఆఫర్లను సైతం రిజెక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది.
ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న రజనీకాంత్ నుంచి కూడా అతనికి ఒక భారీ ఆఫర్ అయితే వచ్చింది. కానీ ఈ సినిమాకి స్టిక్ అయిపోవడం వల్ల ఆ సినిమాలను వదులుకొని ఈ ఒక్క సినిమా మీదనే తన దృష్టిని కేంద్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం ఆయన ఇలాంటి చాలా త్యాగాలను కూడా చేస్తున్నాడు…
Also Read : సుజీత్ తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలుగు స్టార్ హీరో…