https://oktelugu.com/

Viral video : సలసల కాగే నూనెలో చేతులతో అదేం పని రా బాబూ.. వైరల్ వీడియో

Viral video : సాయంత్రం అయితే వేడి వేడి చాయ్ తాగాలని.. పంటి కింద కరకరలాడే స్నాక్స్ తినాలని చాలామందికి ఉంటుంది. అందువల్లే బడ్డి కోట్లు పెరిగిపోతున్నాయి. మిర్చిలు, గారెలు, సమోసాలు తయారీ విపరీతంగా ఉంటున్నది.

Written By: , Updated On : March 19, 2025 / 02:04 PM IST
Viral video

Viral video

Follow us on

Viral video : సాధారణంగా సాయంత్రం పూట చాలామందికి వేడివేడి చాయ్ తాగి తలనొప్పి తగ్గించుకోవాలని ఉంటుంది. స్నాక్స్ తిని సరదాగా గడపాలనిపిస్తుంది. ఇక నేటి కాలంలో చాలామందికి ఆర్థిక స్థిరత్వం పెరిగిన నేపథ్యంలో తమ ఆహార విధానాలను కూడా పూర్తిగా మార్చుకున్నారు. తమ పద్ధతులకు కూడా సరికొత్త భాష్యం చెబుతున్నారు. అందువల్లే సాయంత్రం పూట చాయ్ తాగే వారి సంఖ్య పెరుగుతుంది. స్నాక్స్ తినే వారి సంఖ్య కూడా ఎక్కువ అవుతోంది. మారుమూల గ్రామాల నుంచి మొదలుపెడితే నగరాల వరకు సాయంత్రం పూట స్నాక్స్ అందుబాటులో ఉంటున్నాయి. గ్రామాలలో అయితే బడ్డి కోట్లు.. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అందుబాటులో ఉంటుండగా.. ఇక నగరాలలో అయితే ప్రత్యేకమైన అవుట్ లెట్లు దర్శనమిస్తున్నాయి. ఇక ప్రజల స్థాయికి తగ్గట్టుగా స్నాక్స్ కొనుగోలు చేస్తున్నారు. స్నాక్స్ విభాగంలో ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్. అయితే వీటిల్లో ఎక్కువగా మిర్చి బజ్జి, పెసర, మినప, బొబ్బెర గారెలు, ఆనియన్ పకోడీ, పన్నీర్ పకోడీని తినడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు.

Also Read : అరే ఏంట్రా ఇది.. ఇలా గుడ్డు వేయగానే.. అలా ఆమ్లెట్ వచ్చింది.. వైరల్ వీడియో

చేతులు కాలవా..

స్నాక్స్ తయారు చేసే వాళ్ళు అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తారు. అప్పటికప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తుంటారు.. అప్పటికప్పుడే పిండి కలుపుతుంటారు. వేగంగా బజ్జీలు, గారెలు, పకోడీలు వేస్తూ ఉంటారు. చూసేవాళ్ళకు అదంతా చిత్రంగా అనిపిస్తుంది. పనిచేస్తోంది మనుషులా? లేకపోతే రోబోలా? అనే అభిప్రాయం కలుగుతుంది. అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఓ వీడియోలో మాత్రం స్నాక్స్ తయారు చేసే వ్యక్తి సలసల కాగే నూనెలో తన రెండు చేతులను పెడుతున్నాడు. అంతే వేగంగా అందులో ఉన్న మిరపకాయ బజ్జీలను తీస్తున్నాడు.. చేతికి అంటిన నూనెను పొయ్యిలో చల్లుతున్నాడు. దీంతో మంటలు మరింత దట్టంగా వ్యాపిస్తున్నాయి. చూసేవాళ్ళకు మాత్రం ఆ దృశ్యం భయానకంగా ఉంది. వామ్మో ఇతడేంటి ఇలా ఉన్నాడు? వేడివేడి నూనెలో చేతులతో ఆ పని చేస్తున్నాడు? ఇతడు మనిషి కాదు.. వేరే గ్రహం లో పుట్టి భూమి మీదకు వచ్చి ఉంటాడని నెటిజన్లు పేర్కొంటున్నారు. ” ఇలాంటి అపరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేసే వంటకాలను తినకపోవడమే మంచిది. దీనివల్ల లేనిపోని రోగాలు వస్తాయి. పైగా ఆ నూనె కూడా అంత నాణ్యంగా లేదు. అతడేమో ఆగమాగంగా స్నాక్స్ తయారు చేస్తున్నాడు. చూసేవాళ్ళలో ఆసక్తిని పెంచడానికి వేడి వేడి నూనెలో చేతులు పెడుతున్నాడు. దీనివల్ల జనాలు తినడానికి వస్తారేమోగాని.. ఒక్కసారి తిన్నవాళ్లు మరోసారి అక్కడికి రాలేరు. ఎందుకంటే అక్కడ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉంది. అపరిశుభ్రమైన పరిసరాల మధ్య తయారు చేసే వంటకాలు తినడం ఎప్పటికైనా అనారోగ్యమేనని” నెటిజన్లు అంటున్నారు..కాగా, ఈ వీడియో ఇప్పటికే మిలియన్ల కొద్దీ వ్యూస్ దక్కించుకుంది.

Also Read : దండం రా దూత.. డబ్బులు ఇలా కూడా లెక్క పెడతారా? వైరల్ వీడియో