Homeక్రీడలుక్రికెట్‌WPL Final : ఢిల్లీ జట్టు భారీ స్కోరు.. స్మృతి చేసిన తప్పిదం అదే..

WPL Final : ఢిల్లీ జట్టు భారీ స్కోరు.. స్మృతి చేసిన తప్పిదం అదే..

WPL Final ం వడదరలో జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ జట్టు భారీ స్కోర్ చేసింది.. వేగంగా 204 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు జట్టు ముందు ఉంచింది.. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఢిల్లీ జట్టు 203 పరుగులు చేసింది. తద్వారా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో నాకౌట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేసిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. ఢిల్లీ జట్టులో కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(57), లారా (44), లీ(37), హెన్రీ (35*) సత్తా చూపించారు. బెంగళూరు బౌలర్లలో సయాలి, అరుంధతి రెడ్డి, డీ క్లర్క్ తలా ఒక వికెట్ సాధించారు.

వాస్తవానికి ఢిల్లీ జట్టు ఈ స్థాయిలో స్కోర్ చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ముఖ్యంగా ఢిల్లీ జట్టు తొలి ఆరు ఓవర్లలో 53 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పటికి ఒక వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో ఢిల్లీ జట్టు రన్ రేట్ 8.83 గా నమోదయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ జట్టు మీద ఒత్తిడి పెంచడంలో కెప్టెన్ స్మృతి విఫలమైంది. ఈ క్రమంలోనే ఏడు నుంచి 15 ఓవర్లలో ఢిల్లీ జట్టు ఏకంగా 87 పరుగులు చేసింది. 9.66 రన్ రేట్ కొనసాగించింది. చివరి 4 ఓవర్లలో అయితే ఢిల్లీ జట్టు 12.6 రన్ రేట్ తో ఏకంగా 63 పరుగులు చేసింది. తద్వారా 203 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

ఢిల్లీ జట్టు బ్యాటర్లు ఈ మ్యాచ్ లో పేస్ బౌలర్లు 16 ఓవర్ల పాటు బౌలింగ్ వేస్తే.. 9.56 ఎకనామితో 153 పరుగులు చేశారు. ఇందులో మూడు వికెట్లు కోల్పోయారు. 13 ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టారు. స్పిన్ బౌలర్ల బౌలింగ్లో నాలుగు ఓవర్లలో 50 పరుగులు చేశారు. ఎకనామీ రేటు 12.50 గా నమోదయింది. ఇందులో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.

వాస్తవానికి వర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయిన తర్వాత.. ఢిల్లీ జట్టుకు ఏ దశలో కూడా కోలుకునే అవకాశాన్ని బెంగళూరు బౌలర్లు ఇవ్వరని అందరూ అనుకున్నారు. కానీ బౌలింగ్ కూర్పు విషయంలో స్మృతి విఫలమైనట్టు కనిపిస్తోంది. బెంగళూరు బౌలర్లలో లారెన్ మాత్రమే కట్టుదిట్టంగా బౌలింగ్ వేసింది. నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన లారెన్ 19 పరుగులు మాత్రమే ఇచ్చింది. రాధ యాదవ్ (రెండు ఓవర్ లు వేసి 18 పరుగులు) మినహా మిగతా బౌలర్లు మొత్తం పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. తద్వారా ఢిల్లీ జట్టు ఆస్థాయిలో స్కోర్ చేయగలిగింది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version