YSRCP
YSRCP : ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా కన్నబాబును( kannababu ) నియమించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఆయనకు ఆదిలోనే షాక్ తగిలినట్లు కనిపిస్తోంది. గ్రేటర్ విశాఖ పీఠం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు దూరమైనట్టేనని తెలుస్తోంది. కొద్ది రోజుల్లో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు సమాచారం. ఈ తరుణంలో కురసాల కన్నబాబు పార్టీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆయనను పట్టించుకునే నేతలు విశాఖలో లేరు. పైగా అపోజిషన్.. ఆపై పార్టీ ప్రమాదంలో ఉంది. ఇటువంటి సమయంలో బుజ్జగింపులే తప్ప.. వార్నింగులు పనిచేయవు. కానీ కన్నబాబు మాత్రం కార్పొరేటర్లను హెచ్చరిస్తున్నారు. తమ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లలేదని చెబుతున్నారు. నిన్ననే పార్టీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. అయితే 58 మంది కార్పొరేటర్లకు గాను.. కేవలం 25 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో కూడా ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో తెలియని పరిస్థితి.
Also Read : వైసీపీకి నడిపించే నాయకులు కావలెను.. ఆ 100 నియోజకవర్గాల్లో లోటు*
* అప్పట్లో హడావిడి
విశాఖ అంటేనే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ హడావిడి నడిచేది. విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి తో పాటు రెడ్డి సామాజిక వర్గమంతా విశాఖ నగరం పై మొహరించింది. 2021 లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణతో పాటు చాలా రకాలుగా ప్రభుత్వ వైఫల్యాలు అప్పుడు బయటపడ్డాయి. దీంతో విశాఖలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తప్పదని అంతా భావించారు. కానీ విజయసాయిరెడ్డి తన శక్తి యుక్తులను ఉపయోగించి పార్టీని అక్కడ నిలబెట్టారు. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. నాడు మేయర్ పీఠం దక్కించుకోవడం వెనుక విజయసాయిరెడ్డి కృషి ఉందన్నది బహిరంగ రహస్యం.
* విజయసాయిరెడ్డి నిష్క్రమణతో..
అయితే విశాఖలో జరిగింది ఒకటి. విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాక చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీకి దూరమయ్యారు విశాఖలో. తనకంటూ అక్కడ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు విజయసాయిరెడ్డి. అప్పట్లో కార్పొరేటర్ల టిక్కెట్లు ఇప్పించుకోవడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. ఎప్పుడైతే విజయసాయిరెడ్డిని తొలగించి వైవి సుబ్బారెడ్డిని ఇంచార్జ్గా నియమించారు అప్పుడే చాలామంది నేతలు అసంతృప్తికి గురయ్యారు. పక్క చూపులు చూశారు. కూటమి పార్టీల్లో చేరారు. 58 మంది కార్పొరేటర్లకు గాను కేవలం పాతికమంది మిగిలారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందులో కూడా ఎంతమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి.
* పడరాని పాట్లు
ప్రస్తుతం కార్పొరేటర్ లను కాపాడుకునే పనిలో ఉన్నారు కురసాల కన్నబాబు. కానీ విశాఖ( greater Visakha ) నగరంలో రాజకీయం చేయడం అంత ఈజీ కాదు. ఈ విషయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సాయం తీసుకుంటున్నారు. కానీ పార్టీ పూర్తిగా పట్టు కోల్పోయింది విశాఖలో. ఇటువంటి పరిస్థితుల్లో మేయర్ పీఠం కాపాడుకోవడం అంత ఈజీ కాదు. మొత్తం వైయస్సార్ కాంగ్రెస్ కీలక నేతలంతా సైడ్ అయ్యారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం తమకు ఎందుకు ఆ గొడవ అన్నట్టు ఉన్నారు. దీంతో మేయర్ పీఠం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పాతికమంది కార్పొరేటర్లలో ఎంతమంది వైసీపీలో కొనసాగుతారో.. ఎంతమంది కూటమికి జై కొడతారో అంచనా కూడా వేయలేని పరిస్థితి ఉంది.
Also Read : వైసీపీని వీడుతున్నారు సరే.. ఏ పార్టీలో చేరరెందుకు?