https://oktelugu.com/

Viral video : అరే ఏంట్రా ఇది.. ఇలా గుడ్డు వేయగానే.. అలా ఆమ్లెట్ వచ్చింది.. వైరల్ వీడియో

Viral video : చైనాలో ఎలాంటి వస్తువైనా తయారవుతుంది. ఆపిల్ కంపెనీ అమెరికా కేంద్రంగా ఫోన్లు తయారు చేస్తే.. ప్రతి ఏడాది సరికొత్త మోడల్ ను ఆవిష్కరిస్తే.. దానికి డూప్లికేట్ మోడల్ చైనాలో తయారవుతుంది.

Written By: , Updated On : March 20, 2025 / 08:50 AM IST
Viral video

Viral video

Follow us on

Viral video : చైనాలో ఎలాంటి వస్తువైనా తయారవుతుంది. ఆపిల్ కంపెనీ అమెరికా కేంద్రంగా ఫోన్లు తయారు చేస్తే.. ప్రతి ఏడాది సరికొత్త మోడల్ ను ఆవిష్కరిస్తే.. దానికి డూప్లికేట్ మోడల్ చైనాలో తయారవుతుంది. ఆపిల్ ఫోన్ లక్షల్లో లభిస్తుంటే.. చైనాలో తయారైన ఆపిల్ ఫోన్ మాత్రం వేలల్లోనే లభిస్తుంది. చైనాలో ప్రతి ఉత్పత్తి దొరుకుతుంది.. కాకపోతే దానికి గ్యారెంటీ ఉండదు. వారంటీ అంతకన్నా ఉండదు. ఒక వస్తువును పోలిన వస్తువును క్షణంలోని తయారు చేస్తారు. దాని మన్నిక విషయంలో మాత్రం చైనా తయారీదారులు ఏమాత్రం జాగ్రత్తలు తీసుకోరు. ఒరిజినల్ కంపెనీ ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బ కొడతారు. అంతిమంగా ఆర్డర్లు మొత్తం తమకు వచ్చేలాగా చూసుకుంటారు. చివరికి తమ దేశంలో ఉపాధి పెంచుకుంటారు.. అత్యంత విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించుకుంటారు. ఇదే క్రమంలో అసలు కంపెనీలు నష్టాలతో మూతపడేదాకా వదిలిపెట్టరు. కాకపోతే ఆపిల్.. ఇతర పెద్ద పెద్ద కంపెనీల ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి కాబట్టి తట్టుకుంటున్నాయి. ఒకవేళ అంతగా ఆర్థిక బలం లేకపోతే చైనా తాకిడి వల్ల ఎప్పుడో మూతపడేవి.

Also Read : దండం రా దూత.. డబ్బులు ఇలా కూడా లెక్క పెడతారా? వైరల్ వీడియో

ఇప్పుడు సరికొత్త యంత్రం

సాధారణంగా మధ్యాహ్నం సమయంలో ఆకలిగా ఉన్నప్పుడు.. నాలుక కొత్త రుచి కోరినప్పుడు వెంటనే మన నోటి వెంట వచ్చేది ఆమ్లెట్ వేయమని.. వేడివేడి ఆమ్లెట్ ను .. అన్నం, కూరలో కలుపుకొని తినే అలవాటు చాలా మందిలో ఉంటుంది. కొంతమంది అయితే మధ్యాహ్న సమయంలో భోజనం చేసేటప్పుడు ఆమ్లెట్ కచ్చితంగా ఉండాలి. ఈ ఆమ్లెట్ కోసం వంటింట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు చాలానే ఉంటాయి.. రెండు గుడ్లను గిలక్కొట్టి.. అందులో పసుపు, అల్లం, ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని.. పెనం మీద దోరగా కాల్చి.. వేడి వేడి అన్నంలో తింటే అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఆమ్లెట్ వేసే ఓపిక మగవాళ్లకు అంతగా ఉండదు. ఒకవేళ ఆమ్లెట్ వేసినా అంత నైపుణ్యం గా రాదు. అయితే ఇప్పుడు చైనా కంపెనీ ఆమ్లెట్ తయారు చేసే యంత్రాన్ని రూపొందించింది. ఆ యంత్రంలో గుడ్డు వేయగానే.. క్షణంలోనే ఆమ్లెట్ వస్తున్నది. కాకపోతే అందులో ఉల్లిపాయలు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర.. ఇతర దినుసులు ఏవీ కలపడానికి ఉండదు. ఇలా గుడ్డు వేయగానే యంత్రం నుంచి అలా ఆమ్లెట్ వస్తున్నది. అయితే ఈ యంత్రం ఇప్పుడే ప్రయోగదశలో ఉందని.. భవిష్యత్తు కాలంలో మరిన్ని మార్పులు చేసి.. సరికొత్త మోడల్ అందుబాటులోకి తీసుకొస్తామని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు..” గుడ్డును వేయగానే ఆమ్లెట్ వచ్చే విధంగా రూపొందించిన యంత్రంలో అనేకమార్పులు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇంకా కొన్ని దశలు పెండింగ్లో ఉన్నాయి. వాటిని మొత్తం పూర్తి చేసిన తర్వాత యంత్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని” చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read : సామ్ సంగ్ ఫోన్ ఎత్తుకెళ్లిన కోతి.. పాపం ఆ యువకుడిని ఎన్ని తిప్పలు పెట్టిందో.. వైరల్ వీడియో