Viral video
Viral video : గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. బడ్డీ కోట్ల నుంచి మొదలుపెడితే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు స్కానర్లు కనిపిస్తున్నాయి. రూపాయి నుంచి మొదలు పెడితే లక్షల వరకు స్కానర్ల ద్వారానే చెల్లింపులు సాగుతున్నాయి. అందువల్లే లిక్విడ్ కరెన్సీ అనేది పెద్దగా కనిపించడం లేదు. అయితే కొన్ని చోట్ల మాత్రం లిక్విడ్ కరెన్సీ ద్వారానే లావాదేవీలు జరుగుతున్నాయి.. లిక్విడ్ కరెన్సీలో లావాదేవీలు జరిగినప్పుడు నోట్లను లెక్కపెట్టడానికి వెట్ డస్టర్ వాడుతుంటారు.. కొన్నిచోట్ల అయితే ప్రత్యేక పాత్రలో నీటిని పెట్టి.. దానితడిని చేతివేళ్ళకు తగిలించి కరెన్సీ నోట్లను లెక్కపెడుతుంటారు.. అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వీడియోలో మాత్రం డబ్బులు లెక్క పెట్టే విధానం విచిత్రంగా ఉంది. దాన్ని చూసినవారు విపరీతంగా నవ్వుతున్నారు. ఇలా కూడా నోట్లను లెక్కబెడతారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Also Read : 9 ఏళ్లకే ప్రెగ్నెంట్ అయిన బాలిక.. ఇదెక్కడి విడ్డూరం అండీ బాబు!
ఇంతకీ ఏం చేశాడంటే..
సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి చేతినిండా నోట్ల కట్టలు ఉన్నాయి. వాటిని అతడు లెక్క పెట్టాలి. అతడి నోట్లో లాలాజలాన్ని తీసుకునేంత ఆలోచన ఉందో? లేదో? తెలియదు గాని.. అతని పక్కన మాత్రం ఒక గేదె ఉంది. అది అత్యంత బలిష్టంగా ఉంది. పైగా పాలు కూడా భారీగా ఇస్తోంది. దాని నోటి నుంచి చొంగ విపరీతంగా కారుతోంది. నోట్ల కట్టలను లెక్కపెట్టడానికి అతడు అటు ఇటు చూసాడు. పక్కన గేదె ఉండడం.. దాని నోట్లో నుంచి చొంగ కారుతూ ఉండడం.. దానిని రెండు చేతివేళ్లతో పట్టుకుని.. నోట్ల కట్టలను లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. దీనిని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో అందుబాటులో ఉంచారు. దెబ్బకు ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. దీనిని చూసినవారు దండం రా దూత.. నోట్ల కట్టలను ఇలా కూడా లెక్క పెడతారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.. మరికొందరేమో సోషల్ మీడియాలో ప్రాచుర్యాన్ని పొందడానికి ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తున్నారని.. ఇటీవల కాలంలో ఇలాంటివి పెరిగిపోయాయని.. సోషల్ మీడియా వల్ల ఇలాంటి దారుణాలు ఇంకా చాలా చూడాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. కామెంట్ల సంగతి ఎలా ఉన్నప్పటికీ.. గేదె చొంగ తో నోట్ల కట్టలను లెక్కపెట్టడం మాత్రం భలే విచిత్రంగా ఉందని… ప్రపంచంలో ప్రతి వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వ్యక్తుల్లో ఇతడు ముందు వరుసలో నిలుస్తాడని.. ఇతడిలో చాలా టాలెంట్ ఉందని.. దానిని మరింతగా గుర్తించాల్సిన అవసరం ఉందని.. అతడిని మరింతగా ప్రోత్సహిస్తే ఇంకా ఇంకా అద్భుతాలు చేస్తాడని.. నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఎన్టీయార్ చిన్నప్పటి క్లాసికల్ డ్యాన్స్ చూస్తే మతిపోతుంది… వీడియో వైరల్…