Saudi Arabia – Mohammed Bin Salman సౌదీ అరేబియా.. ఇటీవల కాలంలో ఎక్కువ వార్తల్లో ఉంటోంది. ఇవాళ ఈ దేశం అడుగులపై తెలుసుకుందాం. సౌదీ అరేబియాకు గల్ఫ్ దేశాల్లో అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఇస్లాం మత స్థాపన సౌదీలో జరిగింది. మహ్మద్ ప్రవక్త ఇక్కడే పుట్టాడు. మొట్టమొదటి ఇస్లాం రాజ్య స్థాపన మదీనాలో జరిగింది. డెమాస్కస్ నుంచి బాగ్దాద్ , టర్కీ వరకూ ఇస్లాం వ్యాపించింది.
మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత సౌదీ అరేబియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. సౌదీలో వహాబీజం అనేది రాడికల్ ఇస్లాంకు బీజాలు పడ్డాయన్నది అందరూ చెబుతుంటారు. కొందరు దీన్ని ఆసరాగా తీసుకొని తీవ్రవాదం వైపు మళ్లారు. ఇస్లాంను ప్రమాణికంగా తీసుకోవాలంటే సౌదీని తీసుకుంటారు.
అటువంటి సౌదీలో చాలా చాలా మార్పులకు గురవుతోంది. ముఖ్యంగా 2015లో మహ్మద్ సల్మాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల కుమారుడు మహ్మద్ బిన్ సులేమన్ (ఎంబీఎస్) కీలక పాత్ర పోషించడం ప్రారంభించాడు. మొదట మంత్రిగా.. ఆ తర్వాత డిప్యూటీ మంత్రిగా.. 2022లో ప్రధానమంత్రిగా ఎంబీఎస్ ఎదిగాడు. పరిపాలన అంతా ఈయన గ్రిప్ లోకి వచ్చాడు.
మొదట్లో ఎంబీఎస్ చాలా దారుణంగా కఠినంగా వ్యవహరించేవాడు. వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్ ఖస్తోగీ ని నరికిపారేశాడు. ముక్కలు ముక్కులగా చేశాడు. దీంతో అమెరికాతో సౌదీ అరేబియా సంబంధాలు దెబ్బతిన్నాయి. జోబైడెన్ తో తీవ్ర విభేదాలు వచ్చిపడ్డాయి. అయితే తాజాగా ఎంబీఎస్ మారిపోయాడు. సంస్కరణ వాదిగా మారిపోయాడు.
యువరాజు MBS ఆధ్వర్యంలో రూపాంతరం చెందుతున్న సౌదీ అరేబియా పరిస్థితిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు.