Woman holding urine: మన శరీరంలో 70% వరకు మీరు నిండి ఉంటుంది. అయితే ఈ నీరు ఎంత మాత్రం సరిపోదు. ఎందుకంటే చెమట ద్వారా.. మూత్రం ద్వారా బయటకు వెళ్తూనే ఉంటుంది. నీరు తక్కువైనప్పుడల్లా మళ్ళీ తీసుకుంటూనే ఉంటాం. అయితే ఇలా నీరు తీసుకోవడం అది శరీరమంతా వడకట్టిన తర్వాత వృధా నీటిని బయటకు పంపేయడం సక్రమంగా ఉంటే శరీరానికి ఎలాంటి హాని చేయకూడదు. శరీరమంతా నీరు వడకట్టిన తర్వాత మూత్ర రూపంలో బయటకు పోతుంది. ఇది అనుకున్న సమయానికి బయటకు వెళ్తేనే ఎలాంటి ప్రమాదం ఉండరు. కానీ ఒక మహిళ ఈ నీటిని విసర్జన చేయకుండా ఆపుకుంటూ ఉండేది. అలా చేయడం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటనను బట్టి తెలుస్తుంది. 28 ఏళ్ల ఒక మహిళ తరచూ మూత్రం వస్తుండగా విసర్జన చేయకుండా ఆపుకునేది. కానీ ఆ తర్వాత శరీరంలో ఇన్ఫెక్షన్ పెరిగి కొద్ది కాలానికి మరణించింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
కార్పొరేట్ కార్యాలయంలో పనిచేసే ఓ మహిళ పరిశుభ్రమైన టాయిలెట్స్ ఉంటే మాత్రమే మూత్రవిసర్జన చేయడానికి ఇష్టపడేది. కానీ ఆమె నివసిస్తున్న నగరాల్లో కొన్నిచోట్ల పరిశుభ్రమైన వాతావరణం కనిపించలేదు. దీంతో అనుకున్న సమయంలో మూత్ర విసర్జన చేయలేదు. దీంతో ఆమె పబ్లిక్ టాయిలెట్లను ఎక్కువగా ఉపయోగించలేదు. ఫలితంగా ఇది ప్రమాదకరంగా మారి మరణానికి దారితీసింది. ఆమె మృతికి మూత్ర విసర్జన ఆపుకోవడమే కారణమని డాక్టర్ అదితి వివరించారు. ఆమెకు ఇన్ఫెక్షన్ అయిన తర్వాత వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. ఆమెను పూర్తిగా పరీక్షించిన తర్వాత అదితి అనేక వివరాలు తెలుసుకున్నారు. 25 ఏళ్ల మహిళా కొంతకాలంగా మూత్రవిసర్జన ఆపుకోవడం ద్వారా ఆమె యూటీడీ మూడో ఎపిసోడ్స్ ను భరించాల్సి వచ్చిందని ఫలితంగా ఆమె వైద్యుడి వద్దకు చేరుకునే లోపే శరీరంలో ఇన్ఫెక్షన్ వ్యాపించిందని అదితి తెలిపారు.
అయితే నేటి కాలంలో పురుషుల్లోనూ ఈ సమస్య ఎక్కువగా ఉందని అంటున్నారు. కొందరు నగరాల్లో పని చేసేవారు సరైన టాయిలెట్ లేక మూత్రవిసర్జన చేయడానికి ఎక్కువగా ఇష్టపడడం లేదని.. అంతేకాకుండా పని ఒత్తిడి కారణంగా మూత్రవిసర్జనను ఆపుకుంటున్నారని.. ఇలా చేయడం వల్ల అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని వైద్యులు తెలుపుతున్నారు. మూత్ర విసర్జన ఆపుకోవడం వల్ల ప్రైవేట్ పార్టులో ఉన్న నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమై తీవ్ర ఇన్ఫెక్షన్ వస్తాయి. తరచుగా మూత్రం ఆపుకునే వారిలో బ్లాడర్ సమస్యలు వస్తాయి.. రాను రాను ఇది కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా దారితీస్తుంది. తీవ్రమైన కేసులలో సెప్సిన్ లాంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. కొన్ని రోజులకు ఏవైనా కొత్త సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
అయితే కొందరు మూత్రం ఎక్కువగా వస్తుందని నీరు తాగడం ఆపేస్తారు. అలా చేయడము మంచిది కాదు. సరైన నీరు తాగుతూనే అవసరమైన మూత్ర విసర్జనకు అనుకూలమైన ఉన్న ప్రదేశాల్లో ఉండాలి. లేదా ప్లానింగ్ ప్రకారం గా టైం టు టైం మూత్ర విశాల్ దిన చేస్తుండాలి. అలా చేస్తే శరీరంలో ఇటువంటి ఇన్ఫెక్షన్ ఉండకుండా ఉంటుంది. కొందరిలో మూత్రవిసర్జన ఇన్ఫెక్షన్ జరిగే ముందు వాంతులు, జ్వరం రావడం, ప్రైవేట్ పార్టులో తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇలాంటి లక్షణాలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.