Homeఅంతర్జాతీయంBangladesh Protests: భారత్‌ ను బంగ్లాదేశ్‌ అందుకే రెచ్చగొడుతోందా?

Bangladesh Protests: భారత్‌ ను బంగ్లాదేశ్‌ అందుకే రెచ్చగొడుతోందా?

Bangladesh Protests: బంగాలదేశ్‌ రెండు రోజులుగా భగ్గుమంటోంది. ఏడాదిన్నర క్రితం రిజర్వేషన్ల విషయంలో జరిగిన అల్లర్ల కారణంగా ప్రధాని షేక్‌ హసీనా పదవి వీడి.. దేశం నుంచి పారిపోయారు. ఈ అల్లర్లతో బంగ్లాదేశ్‌లోని హిందువులు తీవ్రంగా నష్టపోయారు. ఇక తాజాగా విద్యార్థి నాయకుడు, భారత వ్యతిరేకి అయిన షరీఫ్‌ ఉస్మాన్‌ బిన్‌ హాదీ హత్యతో మరోమారు భగ్గుమంది. భారత్‌పై ఆరోపణలు చేస్తూ, హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతుఆన్నయి. ఈ హింసలో ఒక హిందూ వ్యక్తి మృతిచెందాడు. ఆ దేశ అంతర్గత విషయాల్లో భారత్‌ జోక్యం లేకపోయినా వ్యతిరేక ధ్వనులు బలపడ్డాయి.

బంగాళాఖాతంలో పెరుగుతున్న టెన్షన్లు
కొన్ని నెలలుగా బంగ్లాదేశ్‌ చేపల బోట్లు భారత సముద్ర జలాల్లోకి వస్తున్నాయి. బంగ్లా నావికాదళం గస్తీలను డ్రామాటిక్‌గా పెంచింది, ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 15న జరిగిన ఘటనలో భారత బోటును బంగ్లా నావికాదళం ఢీకొట్టి 16 మంది మత్స్యకారులను సముద్రంలోకి తోసేసింది. ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ 11 మందిని కాపాడగా, మిగిలిన వారి గురించి ఇంకా సమాచారం లేదు.

ఎన్నికల నేపథ్యంలో అల్లర్లు..
వచ్చే ఫిబ్రవరిలో బంగాదేశ్‌లో జాతీయ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో భారత వ్యతిరేక విధానాన్ని రొచ్చగొట్టి రాజకీయ లాభం పొందాలని మహ్మద్‌ యూనస్‌ ప్రభుత్వం చూస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత బంగ్లా బోట్లు భారత జలాల్లోకి ఎక్కువగా ప్రవేశించాయి. డిసెంబర్‌ 16న 35 మంది మత్స్యకారులు 500 కేజీల చేపలు పట్టుకున్నారు. అంతకుముందు 8 బోట్లు, 170 మందిని అరెస్టు చేశారు. యూనస్‌ ‘ఈ ప్రాంత సముద్ర రక్షణ మా బాధ్యత‘ అని ప్రకటించిన తర్వాత ఇటువంటి చర్యలు తీవ్రమయ్యాయి.

పాక్, చైనా ప్రభావంతో భారత సవాలు
షేక్‌ హసీనా వెళ్లిపోయి యూనస్‌ అస్థిర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారత–బంగ్లా బంధాలు బలహీనపడ్డాయి. పాకిస్థాన్‌కు దగ్గరవుతూ బంగాళాఖాతంలో ప్రభావం పెంచుకుంటోంది. పార్లమెంటరీ కమిటీ 1971 యుద్ధానంతరం భారత్‌కు మరో సంక్షోభం ఎదురవుతోందని హెచ్చరించింది. మరోవైపు ఢాకాలో పాక్, చైనా ఆధిపత్యం పెరుగుతోంది. ఇది ప్రస్తుతానికి ఇబ్బంది లేకపోయినా భవిష్యత్‌లో బంగ్లాదేశ్‌కు కష్టాలు తప్పవు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version