Bangladesh Crisis Reason: ఏడాదిన్నర తర్వాత బంగ్లాదేశ్ మళ్లీ భగ్గుమంటోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంలో తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత ఉద్యమం చేసింది. అల్లర్లు సృష్టించింది. దీంతో హింస చెలరేగింది. పదుల సంఖ్యలో ప్రజలు మరనించారు. దీంతో షేక్‌హసీనా దేశం విడిచి పారిపోయారు. దీనిని సైన్యం ప్రోత్సహించింది. అయితే తర్వాత మహ్మద యూనస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఏడాదిన్నరగా పాలన సాగిస్తోంది. అయితే పాకిస్తాన్, చైనాతో స్నేహం కొనసాగిస్తూ భారత వ్యతిరేక ఉద్యమం నడుపుతోంది. యువతను రెచ్చగొడుతోంది. ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు.
భారత వ్యతిరేకి హాదీ..
ఉస్మాన్ బిన్ హాదీ భారత వ్యతిరేకి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి ప్రధాన కారకుడు. ఇటీవలే గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఓ మ్యాప్ విడుదల చేశాడు. ఇందులో భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలను కలిపాడు. ఆ మరుసటి మరుసటి రోజే గుర్తుతెలియని సాయుధులు ఆయనపై కాల్పులు జరిపారు. చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మరనించాడు. దీంతో దేశవ్యాప్త అల్లర్లు మొదయ్యాయి.
హిందువులే లక్ష్యంగా హింస..
హాదీ శవాన్ని తరలిస్తుండగా ప్రదేశవాసులు రచ్చ చేసి, ఆందోళనలు మారాయి హిందూ సంఘాలపై దాడులుగా. మతపరమైన ఉద్రిక్తతలు విస్తరించాయి, గ్రామాల్లో హిందువుల ఆస్తులు ధ్వంసమయ్యాయి. యూనస్ పాలితం మునుపు ప్రోత్సహించిన హింస ఇప్పుడు అదే దేశాన్ని విరుగుడలుగా మార్చింది.
అంతర్గత ఘర్షణలతో అశాంతి..
ఒకరినొకరు లక్ష్యంగా చేసుకుని దాడులు పెరిగాయి, సామాజిక విభజన లోతుగా మారింది. పాలకులు, సైనిక దళాలు చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. రాబోయే రోజుల్లో మరిన్ని ఘర్షణలు దేశ విభజనకు దారితీయవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హసీనా పతనం తర్వాత ఏర్పడిన అస్థిర పాలితం, భారత వ్యతిరేక భావాలు దేశాన్ని అశాంతికి గురిచేశాయి. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే, ఆర్థిక–సామాజిక నష్టాలు తీవ్రమవుతాయి. ఐక్యతా ప్రయత్నాలు, మతపరమైన సామరస్యం పునరుద్ధరణ అవసరం ఎంతో ఉంది.