MLA Madan Mitra: మన దేశం హిందూ దేశం కాదు. లౌకిక రాజ్యాంగ దేశం. అన్ని మతాలవారికీ దేశంలో సమాన హక్కులు ఉన్నాయి. 70 శాతం మంది హిందువులను, హిందూ దేవుళ్లను రాజకీయ నేతలు విమర్శించడం, ఎగతాళి చేయడం సర్వ సాధారణం అయింది. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. హిందువుల మధ్య ఐక్యత లేకపోవడం.. ఇందుకు కారణం.. కులాల పేరుతో కొట్టుకోవడం రాజకీయ నాయకులకు, ఇతర మతాల వారికి హిందువులపై చిన్నచూపు ఏర్పడింది. హిందూ దేవుళ్లను ఎవరు ఏమన్నా ఏమీ చేయలేరన్న భావన నెలకొంది. అందుకే రామ మందిరం వివాదాన్ని కాంగ్రెస్ పార్టీ సాదగీస్తూ వచ్చింది. హిందుత్వ పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీ రామ మందిర వివాదానికి చెక్ పెట్టింది. ఇక రాముడు, రామాలయంపై వివాదాలు ఉండవని అంతా భావించారు. కానీ తాజాగా బెంగాల్ ఎమ్మెల్యే రాముడిపై చెత్తవ్యాఖ్యలు చేశాడు.
రాముడు ముస్లిం అంట..
పశ్చిమబెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాముడు హిందువు కాదని, ముస్లిం విశ్వాసాలకు చెందినవాడని చెప్పి రాజకీయ తుఫాను రేపాడు. రాముడి ఇంటిపేరు ఏమిటో చెప్పాలని బీజేపీకి సవాల్ విసిరాడు. ఈ ప్రకటన హిందూ భక్తుల మధ్య కోపాన్ని రేకెత్తించింది. బెంగాల్‌లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
బీజేపీ నేతల ఆగ్రహం..
బీజేపీ నేతలు మిత్రా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఇది హిందూ ధర్మానికి అవమానమని, టీఎంసీ మత విశ్వాసాలపై దాడి చేస్తోందని ఆరోపించారు. మదన్ మిత్రా తన చాటిర్యానికి ఎవరినీ భయపడనని చెప్పడంతో రాజకీయ ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ వివాదం రెండు పార్టీల మధ్య కొత్త ఘర్షణకు దారితీసింది.
నెటిజన్ల ఆగ్రహం..
మరోవైపు మిత్రా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే టీఎంసీ హిందువుల వ్యతిరేక పార్టీ ముద్రపడింది. తాజాగా మిత్రా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 2026లో జరిగే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఇవి ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఓ టీఎంసీ ఎమ్మెల్యే బెంగాల్‌లో బాబ్రీ మసీదు కడతా అన్నాడు. అతడిని సీఎం మమతా బెనర్జీ సస్పెండ్ చేశారు. తాజాగా మరో ఎమ్మెల్యే రాముడిపై వ్యాఖ్యలు చేశాడు.