https://oktelugu.com/

Dog attack : కుక్కే కదా అని ముద్దుపెట్టుకుంటే.. తర్వాత పరిస్థితి ఘోరమైంది!

Dog attack : కుక్క విశ్వాసానికి మారుపేరు. రోజుకో ముద్ద అన్నం పెడితేచాలు ఇంటిముందు పడి ఉంటుంది. విశ్వాసం చూపుతుంది. ఇంకో ముద్ద ఎక్కువ పెడితే చెప్పిన మాట వింటుంది. ఏది అడిగితే అది చేస్తుంది. కానీ అదే కుక్కకు ఇరిటేషన్‌ తెప్పిస్తే.. చికాకు కలిగించే పనులు చేస్తే.. కోపం వచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం మామూలుగా ఉండదు. అసలే అది జంతువు. ఆపై కోపంగా ఉంటుంది. అదే సమయంలో దానికి మనం కోపం తెప్పిస్తే మామూలుగా ఉండదు. […]

Written By:
  • NARESH
  • , Updated On : June 19, 2023 1:32 pm
    Follow us on

    Dog attack : కుక్క విశ్వాసానికి మారుపేరు. రోజుకో ముద్ద అన్నం పెడితేచాలు ఇంటిముందు పడి ఉంటుంది. విశ్వాసం చూపుతుంది. ఇంకో ముద్ద ఎక్కువ పెడితే చెప్పిన మాట వింటుంది. ఏది అడిగితే అది చేస్తుంది. కానీ అదే కుక్కకు ఇరిటేషన్‌ తెప్పిస్తే.. చికాకు కలిగించే పనులు చేస్తే.. కోపం వచ్చేలా ప్రవర్తిస్తే మాత్రం మామూలుగా ఉండదు. అసలే అది జంతువు. ఆపై కోపంగా ఉంటుంది. అదే సమయంలో దానికి మనం కోపం తెప్పిస్తే మామూలుగా ఉండదు. ఈ వీడియోలో అదే జరిగింది. చికాకుగా ఉన్న కుక్కతో పరాచికం ఆడిన ఓ మహిళ చివరకు తన మూతే కోల్పోవాల్సి వచ్చింది.

    రాంగ్‌టైంలో ముద్దు పెట్టి..
    ఓ మహిళకు పెంపుడు జంతువులంటే ఎంతో ప్రేమ. చికాకు, మానసిక ఇబ్బంది ఉన్నప్పుడు తన పెంపుడు జంతువులే ఆమెకు రిలీఫ్‌ ఇస్తుంటాయి. అయితే ఆ మహిళ కూడా ఆలాగే భావించింది. ఓ రోజు బయటకు వెళ్లొచ్చిన ఆ మహిళ తన పెంపుడు కుక్కపై అతి ప్రేమ చూపింది. ముద్దు చేసింది. గారాబాలకు పోయింది. కానీ అది మనలా మనిషి కాదు కదా ఓపికగా ఉండడానికి. అప్పట్టికే కోపంతో ఉన్న పెంపుడు కుక్క తన యజమాని ముద్దు పెట్టగానే వింతగా చూసింది. అప్పటికే ఆ మహిళకు ఏదో తేడా ఉందని అనుమానం వచ్చింది. రాంగ్‌టౌమ్‌లో ముద్దు పెట్టానా అన్న సందేహం మనసులో మెదులుతుండగానే ఆ కుక్క తన యజమానిపై ప్రతాపం చూసింది.

    మూతి కోల్పోవాల్సి వచ్చింది..
    కుక్క ఆగ్రహానికి యజమానురాలు చివరకు తన మూతినే కోల్పోవాల్సి వచ్చింది. బయటకు వెళ్లొచ్చాం.. పెంపుడు జంతువులను చూసి చాలా సేపు అయింది. కాస్త గారాబం చేద్దామని భావించిన యజమానురాలు.. ముద్దు చేద్దామని తన పెంపుడు కుక్క వద్దకు వెళ్లింది. కాసేపు ఆప్యాయంగా ఆ కుక్కను నిమిరింది. తర్వాత మూతిపై ఓ ముద్ద పెట్టింది. మరి ఆ కుక్కకు ముద్దు నచ్చలేదో.. లేక తనను ఒంటరిగా వదిలేసి వెళ్లిందని కోపం వచ్చిందో.. లేక తనకు ఏమీ పెట్టకుండా బయటకు వెళ్లొచ్చింది అన్న కోపమో ఏదో తెలియదు కానీ.. తనకు మద్దు పెట్టిన యజమానురాలును ముద్దు చేయాల్సిన ఆ కుక్క కోపంతో తన యజమానురాలు అని కూడా చూడకుండా.. మూతిని కొరికేసింది. ఆమె మూతిని పీకేసిందో.. నమిలి మింగేసిందో తెలియదు కానీ, తర్వాత యజమారాలు తన మూతినే కల్పోయింది. పెంచుకుంటున్నాం.. తిండి పెడుతున్నాం.. మనం చెప్పినట్లే వింటుంది అనుకున్న ఆ పెంపుడు కుక్కే చివరకు ఆమె పాలిట శాపమైంది. ఆ కుక్క కాటుకు తన మూతినే కోల్పోవాల్సి వచ్చింది.