HomeతెలంగాణTelangana BJP: తెలంగాణ బీజేపీకి ఏమైంది..?

Telangana BJP: తెలంగాణ బీజేపీకి ఏమైంది..?

Telangana BJP: భారతీయ జనతాపార్టీ.. దశాబ్దా కాలంగా దేశంలో ఒక వెలుగు వెలుగుతోంది. మెజారిటీ రాష్ట్రాల్లో సొంతంగా, కొన్ని రాష్ట్రాల్లో మిత్రులతో కలిసి అధికారంలో ఉంది. కానీ తెలంగాణలో బీజేపీ బలపడడం లేదు. ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తున్నా.. గెలిపించాలని చూస్తున్నా.. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో పార్టీ విఫలవుతోంది. ఇందుకు తాజాగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హెచ్చరికే నిదర్శనం. ఎంఐఎం పార్టీకన్నా బలహీనంగా ఉందని పోల్చడం ద్వారా తెలంగాణలో పార్టీ పరిస్థితిని ఎంపీలకు గుర్తు చేశారు.

సినీ నటుల ఆదరణ..
బీజేపీకి సినీ నటుల ఆదరణ ఎక్కువ. చాలా మంది టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్, మరాఠా, కన్నడ, మళయాలీ నటులు బీజేపీలో ఉన్నాయి. తాజాగా సీనియర్‌ నటి ఆమని తాజాగా బీజేపీలో చేరనుందని ప్రకటించడంతో పార్టీలో ఉత్సాహం నెలకొంది. అయినా తెలంగాణలో బీజేపీ బలపడడం లేదు. తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఆశిస్తున్నారు. అయితే, కొందరు నాయకులు కాంగ్రెస్‌తో, మరికొందరు బీఆర్‌ఎస్‌తో దగ్గరి సంబంధాలు పెంచుకుంటున్నారు, ఇది పార్టీ ఐక్యతకు సవాల్‌గా మారింది.

పంచాయతీ ఎన్నికల్లో విజయం..
బీజేపీ పంచాయతీ ఎన్నికల్లో నిర్మల్‌ జిల్లాలో కాంగ్రెస్‌కు మించి స్థానాలు సాధించింది. ఇక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్న ప్రాంతంలో భారీగా పంచాయతీలు గెలవడం నాయకుల స్వేచ్ఛాయుత నిర్ణయాలకు ఉదాహరణ. అయినప్పటికీ, అంతర్గత విరోధాలు పెరగడంతో పార్టీకి కష్టాలు తెచ్చాయి. ప్రధాని మోదీ ఇటీవల హెచ్చరించినా, నాయకుల పద్ధతి మారలేదు.

లోక్‌సభ, ఉప ఎన్నికల్లో అవకాశాలు కోల్పోయారు
లోక్‌సభ ఎన్నికల్లో 8 స్థానాలు ఇచ్చి మద్దతు పొందినా, కంటోన్‌మెంట్, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో త్వరిత నిర్ణయాలు తీసుకోలేక భారీ నష్టం అయింది. సర్పంచ్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చినా, అధిష్టానం నాయకులకు స్వతంత్రత ఇవ్వడంలో విఫలమవుతోంది. ఇలా కొనసాగితే చారిత్రక తప్పు జరుగుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

పార్టీలో అందరూ పనిచేసే నాయకులు ఉన్నప్పటికీ, అంతర్గత కలహాలు, జాప్య నిర్ణయాలు భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టుతున్నాయి. ఇప్పటికైనా ఐక్యత పెంచి, నాయకుల స్వేచ్ఛను ప్రోత్సహించాలి. లేకపోతే తెలంగాణలో బీజేపీ అవకాశాలు దూరమవుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version