Homeవింతలు-విశేషాలుMonkey Latest Viral Video: కోతికేం తెలుసు డబ్బు విలువ.. లక్షల నగదు ఇలా పారేసింది..(వైరల్...

Monkey Latest Viral Video: కోతికేం తెలుసు డబ్బు విలువ.. లక్షల నగదు ఇలా పారేసింది..(వైరల్ వీడియో)

Monkey Latest Viral Video: దేశవ్యాప్తంగా కోతుల సమస్య తీవ్రమైంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో అసలు కోతుల సమస్య ప్రధాన ఎన్నికల ప్రచార అస్త్రంగా మారబోతోంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కోతుల ఆవాసాలు నాశనం కావడం.. అడవుల సంఖ్య తగ్గిపోవడం.. అడవులలో ఆహారం లభించే మార్గాలు లేకపోవడంతో కోతులు తమ మనుగడ కోసం పోరు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అవి జనావాసాల్లోకి రావడం మొదలైంది. అందువల్లే కోతులు ఇళ్ళ మీద పడి దాడులు చేస్తున్నాయి. అందిన వస్తువును పట్టుకెళ్ళిపోతున్నాయి. కొన్ని సందర్భాలలో దాడులు కూడా చేస్తున్నాయి. కోతుల దాడులలో చనిపోతున్న వారు సంఖ్య కూడా పెరిగిపోతోంది. మందలకు మందులుగా వస్తున్న కోతులు పంటపొలాల మీద కూడా దాడులు చేస్తున్నాయి. అందువల్లే రైతులు వేరుశనగ, కంది, పప్పు ధాన్యాల వంటి పంటలను వేయడం లేదు. కేవలం వారి లేదా పత్తి వంటి పంటలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా పప్పుల కొరత తీవ్రంగా ఉన్నది. ఇతర నిత్యవసరాల కొరత కూడా అధికంగా ఉన్నది. దీంతో దేశ అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

కోతుల చేష్టలు ఎలా ఉంటాయి.. కోతల వల్ల కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది.. స్వయంగా అనుభవిస్తేనే అర్థమవుతుంది. అలాంటిది ఓ యువకుడికి కోతుల వల్ల కాస్ట్ లీ అనుభవం ఎదురయింది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన కొడైకనాల్ ను సందర్శించడానికి ఓ వ్యక్తి వెళ్లాడు. అక్కడ అతడు రకరకాల ప్రాంతాలను చూస్తున్నాడు. ఇంతలోనే కోతుల మంద అక్కడికి వచ్చింది. బ్యాగు చేతిలో పట్టుకొని ఆ ప్రాంతాలను సందర్శిస్తున్న ఆ వ్యక్తిని బెదిరించాయి. అంతేకాదు అతడి బ్యాగును లాక్కుని వెళ్లిపోయాయి. ఆ బ్యాగులో తినుబండారాలు ఉన్నాయోమోనని తెగ వెతికాయి. ఆ తర్వాత ఓ కోతి ఆ బ్యాగును పట్టుకొని చెట్టు పైకి ఎక్కింది. దానిని పదేపదే వెతికి చూసింది. అందులో ఉన్న 500 నోట్ల కట్టను బయటికి తీసింది. ఆ తర్వాత ఆ నోట్లను చెల్లాచెదురుగా బయటికి విసిరేసింది. దీంతో ఆ పర్యాటకుడు లబోదిబోమన్నాడు. కొంతమంది ఆ దృశాలను వీడియో తీశారు. తినుబండారాలు.. ఇతర వస్తువులు ఏమీ లేకపోవడంతో ఆ కోతి ఆ బ్యాగును అలా పైనుంచి కిందికి పడేసింది. దీంతో ఆ వ్యక్తి ఆ బ్యాగును వెతుక్కుని.. కింద పడిపోయిన నోట్లను ఒక్కొక్కటిగా జాగ్రత్త చేసుకుంటూ.. తన జేబులో వేసుకున్నాడు.

Also Read: A Dog’s Love vs Human Selfishness: మనుషులు అవసరాలు తీరిన తర్వాత వదిలించుకుంటారు.. శునకాలు అలా కాదుగా.. కనువిప్పు కలిగించే స్టోరీ ఇది!

కొడైకెనాల్ ప్రాంతంలో గతంలో కోతులు అంతగా ఉండేవి కావు. కానీ ఇటీవల కాలంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోతులను ప్రత్యేకమైన వ్యక్తులతో పట్టించి.. ఇక్కడి అడవులలో వేస్తున్నారు. ఫలితంగా కొంతకాలం నుంచి ఈ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా పెరుగుతోంది. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి వచ్చే పర్యాటకులకు అది ఇబ్బందికరంగా మారుతుంది. కోతుల మంద పర్యాటకుల మీద దాడి చేస్తున్న నేపథ్యంలో.. తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కొన్ని సందర్భాలలో పర్యాటకులను గాయాలకు గురిచేస్తున్నాయి.. అయితే స్థానికంగా ఉన్న అటవీ శాఖ అధికారులు కోతుల కోసం పండ్ల మొక్కలు.. వంటి వాటిని పెంచుతున్నప్పటికీ.. మనుషులు తినే తినుబండారాలకు అలవాటు పడిన కోతులు పండ్లను తినడం లేదు. పైగా మనుషులు తయారు చేసుకున్న తినుబండారాలు అత్యంత రుచికరంగా ఉండడంతో.. వాటిని తినడానికి కోతులు విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నాయి. అందువల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కొడైకెనాల్ అటవీశాఖ అధికారులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular