ChrisWood Spirit of cricket
Viral Video : క్రికెట్ లో బ్యాటింగ్ చేస్తున్న వ్యక్తి వేగంగా పరుగులు తీయాలని భావిస్తే.. బౌలింగ్ వేసే వ్యక్తి దూకుడుగా వికెట్లు తీయాలని అనుకుంటాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేసే వ్యక్తులు ఎవరి లక్ష్యాలకు వారు అనుగుణంగా మైదానంలో ఆడుతుంటారు. ఏమాత్రం అవకాశం దొరికినా పై చేయి సాధించాలని భావిస్తారు.. కానీ, ఈ బౌలర్ మాత్రం పూర్తి భిన్నం. తనకు వికెట్ తీసే అవకాశం ఉన్నప్పటికీ వదిలేసుకున్నాడు. ఆటకంటే మానవత్వానికే ప్రాధాన్యం ఇచ్చాడు. అచంచలమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు.
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. జూన్ 2 ఆదివారం ఇంగ్లాండ్ దేశవాళీ క్రికెట్లో భాగంగా హాంప్ షైర్, కెంట్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన కెంట్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. నిర్ణీత 20 తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.. క్రిస్ ఉడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.. 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అనంతరం హంప్ షైర్ 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. మూడు వికెట్ల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.
ఈ మ్యాచ్ లో హంప్ షైర్ విజయాన్ని కాస్త పక్కన పెడితే..కెంట్ జట్టు ఇన్నింగ్స్ సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హంప్ షైర్ బౌలర్ క్రిస్ వుడ్ ఫుల్ లెంగ్త్ డెలివరీ సంధించాడు. ఆ సమయంలో కెంట్ జట్టు బ్యాటర్ ఓయి ఎవిసన్ నేరుగా బలమైన షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి వేగంగా దూసుకు వచ్చింది. నేరుగా నాన్ స్ట్రైకర్ గా ఉండి రన్ కోసం ప్రయత్నం చేస్తున్న మాథ్యూ పార్కిన్సన్ కు బలంగా తగిలింది. దీంతో అతడు మైదానంలో కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో పార్కిన్సన్ కు తగిలిన బంతి బౌలర్ వుడ్ చేతికి అందింది. వాస్తవానికి ఇలాంటి అవకాశం లభిస్తే ఏ బౌలరైనా సరే వికెట్లను పడగొడతారు. రనౌట్ చేస్తారు.
కానీ వుడ్ ఆ సమయంలో అవుట్ చేసే దానికంటే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. తర్వాత బంతి వేసేందుకు వెళ్లిపోయాడు. పార్కిన్సన్ ను సులభంగా రన్ అవుట్ చేసే అవకాశం వుడ్ కు లభించినప్పటికీ.. అతడు ఆ దిశగా అడుగులు వేయలేదు. పార్కిన్సన్ దెబ్బ తగిలి ఇబ్బంది పడ్డాడు. అతని పరిస్థితి చూసి రన్ అవుట్ చేయకుండా, తన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Impeccable sportsmanship
Matt Parkinson is struck by the ball, and Chris Wood chooses not to run him out pic.twitter.com/RijvNEpqWi
— Vitality Blast (@VitalityBlast) June 2, 2024
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Chris wood showed sportsmanship after a cricketer was hit in england domestic cricket
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com