ఈ పేద యువకుడిని బతికించండి ప్లీజ్

చేతికొచ్చిన కొడుకు చేష్టలుడిగి మంచాన పడ్డాడు. తండ్రి వృద్ధాప్యంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తల్లి ఈ ఇద్దరినీ సాకలేక అష్టకష్టాలు పడుతోంది. కాలం వేసిన కాటులో చావు బతుకుల మధ్య యువకుడు ‘శ్రీకాంత్ మ్యాన’ ఇప్పుడు నన్ను బతికించండం అంటూ దాతల కోసం దీనంగా అర్థిస్తున్నాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన మ్యాన శ్రీకాంత్ నిండా 30 ఏళ్లు కూడా లేని యువకుడు. తల్లిదండ్రి కష్టపడి చదివేస్తే బాగా చదివాడు. పేద కుటుంబాన్ని […]

Written By: NARESH, Updated On : December 7, 2021 9:32 pm
Follow us on

చేతికొచ్చిన కొడుకు చేష్టలుడిగి మంచాన పడ్డాడు. తండ్రి వృద్ధాప్యంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. తల్లి ఈ ఇద్దరినీ సాకలేక అష్టకష్టాలు పడుతోంది. కాలం వేసిన కాటులో చావు బతుకుల మధ్య యువకుడు ‘శ్రీకాంత్ మ్యాన’ ఇప్పుడు నన్ను బతికించండం అంటూ దాతల కోసం దీనంగా అర్థిస్తున్నాడు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన మ్యాన శ్రీకాంత్ నిండా 30 ఏళ్లు కూడా లేని యువకుడు. తల్లిదండ్రి కష్టపడి చదివేస్తే బాగా చదివాడు. పేద కుటుంబాన్ని గొప్ప స్థాయికి చేర్చాలని బాగా కష్టపడ్డాడు. కానీ శ్రీకాంత్ పై విధి పగబట్టింది. అతడిని మంచాన పడేసింది.

ఒకనొక దురదృష్టకరమైన రోజున శ్రీకాంత్ కు అనుకోకుండా కడుపునొప్పి వచ్చింది.. తిన్నది అరుగక పోవడం,కంటి సమస్యలు, దమ్ము రావడం తదితర సమస్యలతో బాధపడుతుంటే స్థానిక ఆసుపత్రుల్లో వివిధ పరీక్షలు చేశారు. కానీ సమస్య ఏమిటనేది ఏర్పడలేదు. అనంతరం ప్రైవేటు పెద్ద హాస్పిటల్ నందు వైద్య పరీక్షలు చేయగా రెండు కిడ్నీలు పాడై పోయాయని డాక్టర్లు నిర్ధారించారు. ఆ వార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగు తిన్నారు. చేతికొచ్చి తమను సాదుతాడని చూసిన తల్లిదండ్రులకు ఇప్పుడు ఆ కొడుకే రాలిపోయేలా కనిపిస్తుంటే దు: ఖం ఆపుకోలేక బోరున విలపించారు. చెట్టంత కొడుకు ఇప్పుడు మరణశయ్యపై ఉంటే ఆ పేద కుటుంబం వద్ద డబ్బులు లేక బతికించండని కాళ్లవేళ్లా పడుతోంది. ఇప్పటి వరకు లక్ష రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు. చికిత్స చేయించే స్తోమత లేక వారానికి రెండు రోజులు డయాలసిస్ చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

రెండు కిడ్నీలు పాడైపోయి ఈ పేద యువకుడు యువకుడు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. తండ్రి వృద్ధాప్యం.. తల్లి ఏమీ చేయలేని స్థితిలో బతుకీడుస్తోంది. వీరి జీవనం దినదినగండంగా మారింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ అనారోగ్యం ఆ కుటుంబానికి శాపంగా మారింది.

ఎన్ని చికిత్సలు జరిపినా…కనీసం ఒక్క కిడ్నీ అయినా మార్పు చేయాల్సిందేనని వైద్యులు తేల్చి చెప్పారు. అయితే, కిడ్నీ మార్పు ఖర్చుతో కూడుకున్నదని, అంత స్థోమత తమకు లేదని శ్రీకాంత్ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఎవరైనా దాతలు సహాయం చేసి (ఫోన్: 9502916300) ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ నంబర్ కు ఫోన్ పే/గూగుల్ పే చేసైనా ఆర్థిక సాయం చేయాలని ఆ కుటుంబం దీనంగా అర్థిస్తోంది.