Homeఎంటర్టైన్మెంట్Pushpaka Vimanam: ఘనంగా "పుష్పక విమానం" ప్రీ రిలీజ్ ఈవెంట్... చీఫ్ గెస్ట్ గా విజయ్...

Pushpaka Vimanam: ఘనంగా “పుష్పక విమానం” ప్రీ రిలీజ్ ఈవెంట్… చీఫ్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ

Pushpaka Vimanam: విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. కానీ వీరి నటనతో మాత్రం ప్రేక్షకుల్లో మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత  మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆనంద్. కాగా కొత్త దర్శకుడు దామోదర తెరకెక్కిస్తున్న ”పుష్పక విమానం” అనే సినిమాలో నటిస్తున్నాడు ఆనంద్. ఈ సినిమాను కింగ్ అఫ్ ది హిల్ ఎంటర్టైన్మెంట్స్ మరియు టామ్ గా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈరోజు వైజాగ్‌లో పుష్పక విమానం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు.

pushpaka vimanam movie pre release event on live

ఈ వేడుకకు ముఖ్య అతిధిగా విజయ్ పాల్గొననున్నాడు. ఆయనతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.  తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా ప్రమోట్ చేసేందుకు విజయ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. ప్రమోషన్స్‌ ను తనదైన శైలిలో వినూత్నంగా చేస్తూ ఉంటాడు విజయ్. ఈనెల 10వ తేదీన మహబూబ్‎నగర్‌ లోని తమ సొంత థియేటర్ ఏవీడీ సినిమాస్‌లో పుష్పక విమానం మూవీ స్పెషల్ ప్రీమియర్ షోను వేయనున్నారు. ఈ ప్రీమియర్ షోకు విజయ్ పాల్గొననున్నాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. పెళ్లయిన తర్వాత భార్య వేరొకరితో వెళ్ళిపోతే ఆ యువకుడు పడే అవస్థలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ , ట్రైలర్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version