Medical college bathroom incident: అది కరీంనగర్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజ్.. కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఉంటుంది. ఐడి కార్డు లేకుంటే కాలేజీలోకి అనుమతించరు. బయట వ్యక్తులు రావాలి అనుకుంటే లోపలి నుంచి పర్మిషన్ వస్తేనే సాధ్యమవుతుంది. అలాంటి మెడికల్ కాలేజీలోకి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. పైగా వారు బుర్ఖా ధరించారు. ఆ తర్వాత వారు ఆ ప్రైవేట్ మెడికల్ కాలేజీలోని బాత్రూంలో ప్రవేశించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.
సెక్యూరిటీ సిబ్బంది అనుమానించారు
వారిద్దరి వ్యవహారాన్ని మొదటి నుంచి కూడా సెక్యూరిటీ సిబ్బంది అనుమానించారు. వారు మెడికల్ కాలేజీ లోపలికి ప్రవేశించే సమయంలో ఎంట్రన్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది ఒకరిద్దరు మాత్రమే ఉన్నారు. బుర్ఖా లు ధరించడంతో సెక్యూరిటీ సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో వారిద్దరు మెడికల్ కాలేజీలోకి ప్రవేశించి.. నేరుగా లేడీస్ బాత్రూం లోకి వెళ్లిపోయారు. అయితే సెక్యూరిటీ సిబ్బందికి వారిద్దరి వ్యవహారం అనుమానంగా అనిపించింది. ఇంకేముంది బాత్రూంలో నుంచి వారిద్దరు బయటికి రాగానే ప్రశ్నించారు. బుర్ఖా తీయమని వారిని ఆదేశించారు. బుర్ఖా తొలగించగా.. అందులో ఒకరు మగ.. మరొకరు ఆడగా తేలారు. అయితే వీరిద్దరు ఎందుకు వచ్చారు? దేనికోసం వచ్చారు అనే ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వారిద్దరు బాత్రూంలోకి ప్రవేశించారా.. ఎందుకు వచ్చారు అనే ప్రశ్నలు సెక్యూరిటీ సిబ్బందిలో తలెత్తుతున్నాయి. వారిద్దరూ యుక్త వయసులో ఉన్నారు. వారిద్దరిని ప్రశ్నిస్తుంటే దేనికీ సమాధానం చెప్పడం లేదు.
అనుమానాస్పదంగా ప్రవర్తన
వారిద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉందని.. అందువల్లే వారిని అనుసరించాల్సి వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది చెబుతున్నారు. సీసీ కెమెరాలలో పరిశీలించగా వారిద్దరు సంకేతాలు ఇచ్చుకుంటున్నారని.. అందువల్లే వారిద్దరని అనుసరించాల్సి వచ్చిందని సెక్యూరిటీ సిబ్బంది చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీసులకు సెక్యూరిటీ సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పోలీసుల విచారణలో ఏం తేలుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ మెడికల్ కాలేజీలో వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే సంఖ్యలో రోగులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ఇది బోధనా ఆస్పత్రి కావడంతో జరిగిన సంఘటన కరీంనగర్ జిల్లాలో సంచలనం సృష్టించింది.
మెడికల్ కాలేజీకి బుర్ఖాలో వచ్చి లేడీస్ బాత్ రూంలోకి వెళ్లిన వ్యక్తి
కరీంనగర్ శివారులోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో బుర్ఖాలో వచ్చి లేడీస్ బాత్ రూంలోకి దూరిన వ్యక్తి
అతడితో పాటు స్కార్ఫ్‌తో ఉన్న మరో మహిళను కూడా పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది
ఈ జంట దొంగతనానికి వచ్చారా, లేక… pic.twitter.com/AcyH9hOQWy
— Telugu Scribe (@TeluguScribe) September 5, 2025