Bangarraju Movie: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా కూడా అలరిస్తున్నారు. ప్రస్తుతం నాగార్జున కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం “బంగార్రాజు”. ఇందులో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలానే ఈ సినిమాలో నాగ్ కి జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకి జోడీగా కృతిశెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగార్జున – కళ్యాణ్ కృష్ణ కాంబోలో గతంలో సోగ్గాడే చిన్ని నాయనా మూవీని చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే తాజాగా ఈ సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.

ఈ సినిమా లోని ఫస్ట్ సాంగ్ ను నవంబర్ 9 న ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. ‘లడ్డుందా’ అని సాగే ఈ పాటలో స్వర్గంలో ‘బంగార్రాజు’ రంభ, ఊర్వశి, మేనకలతో కలిసి స్టెప్స్ వెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాటకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా… భాస్కరభట్ల లిరిక్స్ అందించారు. ప్రస్తుతం ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా ప్రస్తుతం నాగార్జున మాత్రం ప్రొఫెషనల్ లైఫ్ పరంగా మాత్రం ఆనందంలో ఉన్నారనే చెప్పాలి. అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ, అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు… మంచి విజయం సాధించగా కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతున్నాయి.