Joe Biden
Joe Biden: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్టు ప్రకటించడంతో పాటు ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ను ప్రశంసలతో ముంచెత్తారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆమెతో కలిసి ఎన్నికల బరిలో నిలువనన్నట్టు ప్రకటించారు. 2021 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. నేటితో ఏడాది పూర్తయిన సందర్బంగా వైట్హోస్లో బుధవారం సాయంత్రం ప్రెసిడెంట్ బైడెన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన ఏడాది పాలనను, తీసుకున్న నిర్ణయాలను సమర్థించుకున్నారు.
అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తన తీసుకున్న నిర్ణయాలు అన్ని సమంజసమైనవేనని ఈ విషయంలో ఎవరినీ క్షమాపణలు కోరాల్సిన అవసరం లేదన్నారు. ముందుగా ఆప్ఘనిస్తాన్ నుంచి అమెరికా ట్రూపులను వెనక్కి పిలిపించే నిర్ణయం కరెక్ట్ అన్నారు. గతంలో తాలిబన్ల చేతకాని తనం వల్లే ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకున్నాయన్నారు. ఇక చైనాపై అమెరికా విధించిన ఆంక్షల విషయంలో తాము ఆలోచించి అడుగులు వేశామన్నారు. ఆంక్షల విషయంలో రివ్యూ చేస్తున్నామని దానికి మరికొంత సమయం పడుతుందన్నారు. ఇరు దేశాల పరస్పర అంగీకారంతో వాణిజ్య అంశాల్లో ఆంక్షల ఎత్తివేతపై ఆలోచిస్తున్నామన్నారు.
Also Read: పండుగల ఎఫెక్ట్: కరోనా కల్లోలం.. దేశంలో ఒక్కరోజులో 3 లక్షల కేసు..
గ్జింజియాంగ్ ప్రాంతంలో వీగర్ ముస్లింలు, హాంగాంక్ మీద చైనా పెత్తనం సరిగా లేదని, దీంతో అక్కడి దిగుమతులపై ఆంక్షలు విధించినట్టు గుర్తుచేశారు. ట్రంప్ హయాంలో ఆంక్షలు విధించగా బైడెన్ కూడా వాటిని కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం అధికారులు దీనిని సమీక్షించే పనిలో ఉన్నారని చెప్పారు. ఉపాధ్యక్షురాలు కమలాహారీస్ గురించి మాట్లాడుతూ.. ఆమె తన విధులను చాలా బాగా నిర్వర్తిస్తోందని, వచ్చే ఎన్నికల్లో కూడా ఆమెతో కలిసి పోటీచేయాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సాధారణంగా అమెరికాకు అధ్యక్షులుగా చేసిన వ్యక్తులు రెండోసారి కూడా పోటీచేసేందుకు ప్రయత్నిస్తారు. బైడెన్ కూడా అందుకు సుముఖంగా ఉన్నట్టు వెల్లడించారు.
Also Read: బడులు తెరుస్తారా లేదా..? తెలంగాణ ప్రభుత్వానికి ట్రస్మా వార్నింగ్
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Read MoreWeb Title: Us president joe bidens announcement for 2024 presidential election
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com