Zomato Delivery Rider: రాత్రి, పగలు, ఎండా, వాన అని తేడా లేకుండా కస్టమర్ కి సేవలు చేసే డెలివరీ బాయ్స్ ని ఎవరు గుర్తిస్తారు చెప్పండి. ఎన్నో కిలోమీటర్లు ప్రయాణం చేసి, వాళ్ళ కోరిన ఐటెం ని ఆలస్యం చేయకుండా తెచ్చిపెట్టే డెలివరీ బాయ్స్ కి ఎంత మంది కనీసం నీళ్లు తాగు బాబు అని అడిగి ఉంటారు చెప్పండి?. ఎంతో మంది విద్యార్థులు ఒక పక్క చదువుకుంటూ , ఇంట్లో వాళ్ళను డబ్బులు అడగడం ఇష్టం లేక, లేదా సిటీ లో ఉండేందుకు వాళ్ళ ఆర్ధిక స్తొమత సరిపోక, పార్ట్ టైం జాబ్స్ లాగా జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా పని చేస్తూ ఉంటారు. వాళ్ళ కష్టాన్ని గుర్తించే వాళ్ళు కూడా ఉండరు. నెలకు వచ్చే 15 , 20 వేల జీతం కోసం పని చేసే ఈ డెలివరీ బాయ్స్ టిప్స్ కోరుకుంటారు, కానీ నోరు తెరిచి అడగలేరు.
కొంతమంది పెద్ద మనసు చేసుకొని టిప్స్ ఇస్తుంటారు. డెలివరీ బాయ్స్ ని ఇంత వరకే మనం పరిమితం చేసి ఉంటాము. కానీ డెలివరీ బాయ్స్ కష్టాన్ని గుర్తించి, వాళ్లకు కచ్చితంగా ఎదో ఒక ట్రీట్ ఇచ్చి, జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేని మధుర జ్ఞాపకాన్ని ఇవ్వాలని ఒక కస్టమర్ కోరుకోవడం నిజ జీవితం లో ఎప్పుడైనా, ఎక్కడైనా చూసారా?. కానీ ఒక ప్రాంతం లో నిజంగానే ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. జొమాటో యాప్ లో ఒక కేక్ ని ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ కేక్ ని తీసుకొచ్చిన డెలివరీ బాయ్ తో , ఆ కేక్ ని కట్ చేయించి , అతను చేస్తున్న సేవలకు సెలెబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
వంద, రెండు వందలు టిప్ ఇస్తే తీసుకొని, అప్పటికప్పుడే ఆ డెలివరీ బాయ్ తనకు టిప్ ఇచ్చిన వాళ్ళను మర్చిపోవచ్చు. కానీ అతన్ని ఒక మనిషి లాగా గుర్తించి, అతను చేసే సేవలకు ఇచ్చిన ట్రీట్ ని జీవితం లో అతని చివరి శ్వాస వరకు మరచిపోలేరు. సొంత కుటుంబ సభ్యులైన ఆ కుర్రాడికి ఇలాంటి అద్భుతమైన మెమరీ ఇచ్చి ఉంటారో లేదో తెలియదు కానీ, అపరిచితులైన ఈ కస్టమర్స్ ఇచ్చిన ఈ మధురమైన మెమరీ మాత్రం అమోఘం అనే చెప్పాలి. ఎన్ని లక్షలు ఇచ్చినా ఇలాంటి ప్రేమని పొందలేరు. ఆ విధంగా ఆ జొమాటో డెలివరీ బాయ్ అదృష్టవంతుడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.