Jana Nayagan Release Date: చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా ఒక సినిమాకు సెన్సార్ బోర్డు నుండి కష్టాలను మొట్టమొదటిసారిగా చూస్తున్నాము. ఒక మెసేజి ఓరియెంటెడ్ సినిమాకు, రాజకీయాలను జోడించి తీస్తే ఇన్ని అడ్డంకులు వస్తాయా అని అనిపించేలా చేస్తుంది సెన్సార్ బోర్డు. ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నామో మీ అందరికీ అర్థం అయ్యే ఉంటుంది, తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) నటించిన ‘జన నాయగన్'(Jana Nayagan) గురించే మాట్లాడుతున్నది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టి, కేవలం ఓవర్సీస్ నుండే 40 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రమిది. ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కినప్పటికీ కూడ విజయ్ చివరి చిత్రం గా ప్రచారం అవ్వడం తో తమిళ ఆడియన్స్ ఈ చిత్రానికి సెన్సేషనల్ ఓపెనింగ్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అన్నీ అనుకున్నట్టుగా జరుగుంటే, కచ్చితంగా ఈ చిత్రానికి 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు కేవలం మొదటి రోజులో వచ్చేవి.
అంతే కాదు, విజయ్ కెరీర్ లో మంచి కమర్షియల్ హిట్ గా కూడా నిలిచేది ఈ చిత్రం. కానీ సెన్సార్ బోర్డు నుండి ఈ రేంజ్ షాక్ వస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అప్పుడప్పుడు సమస్యలు వస్తుంటాయి, అవి సర్వసాధారణమే , ఆ సమస్యల చిక్కుముడి వీడుతుందనే అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు, కోర్టు ఈ చిత్రానికి సంబంధించిన కేసు ని జనవరి 21 కి వాయిదా వేసింది. అప్పటికి కూడా పాజిటివ్ గా తీర్పు రాకపోతే ఈ నెలలో ఈ చిత్రం విడుదల అవ్వడం దాదాపుగా అసాధ్యమే. త్వరలోనే తమిళనాడు లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారితే తప్ప ఈ చిత్రానికి విడుదల మోక్షం దొరకదా కష్టమే అనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి DMK పార్టీ పై ఊహించినంత వ్యతిరేకత లేదు, మరోసారి అధికారం లోకి ఆ పార్టీ నే వస్తుందని అంటున్నారు.
మరోపక్క అన్నా DMK, బీజేపీ కూటమి విజయ్ తో పొత్తు పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతానికి సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయి. విజయ్ కి కూడా వేరే ఛాయస్ లేకపోవడం తో కూటమిలో భాగం అయ్యే అయ్యేందుకు చూస్తున్నట్టు తమిళ వర్గాల నుండి అందుతున్న సమాచారం. వాస్తవానికి విజయ్ TVK మరియు అన్నా DMK పార్టీలు కలిసి పోటీ చెయ్యాలని అనుకున్నారు. కానీ విజయ్ రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి, 65 సీట్లను కోరాడు. కోరినన్ని సీట్స్ ఇవ్వడానికి వాళ్ళు సిద్దమే కానీ, సీఎం పదవి షేరింగ్ కి మాత్రం ఒప్పుకోలేదు, డిప్యూటీ సీఎం పదవి, నాలుగైదు మంత్రి పదవులు ఇస్తామని చెప్పారట. అలా వాళ్ళ మధ్య చర్చలు ఒక పక్క జరుగుతున్న సమయం లోనే, అన్నా DMK పార్టీ బీజేపీ తో పొత్తు ని ప్రకటించింది. ఇది విజయ్ కి పెద్ద షాక్. విజయ్ సిద్ధాంతాలు బీజేపీ కి వ్యతిరేకంగా ఉంటాయి, అలాంటి పార్టీ తో అన్నా DMK పొత్తు పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయారు, వ్యతిరేకించాడు కూడా, కానీ ఇప్పుడు అదే కూటమి తో కలిసి వెళ్లక తప్పడం లేదు.