Drunken Female Teacher: ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు అని మన జాతిపిత మహాత్మగాంధీ చెప్పారు. మనం చెప్పే స్థానంలో ఉన్నామంటే మనం ఆచరించి చూపించాలి. అప్పుడే దాన్ని ఇతరులు కూడా అనుసరిస్తారు. సార్థకత వస్తుంది. సమాజ గతిని మార్చేది ఉపాధ్యాయులే. విద్యార్థులను మంచి దారిలో నడిపించి భావిభారత పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. కానీ వారే గతి తప్పితే. వారే నీచమైన పనికి ఒడిగడితే. కంచే చేను మేస్తే ఇంకేముంది. విద్యార్థులను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన గురువులే నీచంగా ప్రవర్తిస్తున్నారు.
విద్యార్థుల పట్ల ఎంతో గురుతర బాధ్యతలు ఉన్నా వారి ప్రవర్తన అసహ్యంగా ఉండటంతో వారి స్థానం మారుతోంది. విద్యార్థులు కూడా వారిని గౌరవించడం లేదు. కొన్ని చోట్ల విద్యార్థులపై అత్యాచారాలు చేస్తుంటే మరికొన్ని చోట్ల గురువుతు తాగి వస్తూ తమ స్థాయిని తగ్గించుకుంటున్నారు. విద్యార్థుల్లో చులకన అవుతున్నారు. వారి వ్యక్తిగత సమస్యలు మనకు అనవసరం. ఉపాధ్యాయులుగా ఉండాలంటే ఉత్తమమైన మార్గంలో నడవాల్సిందే. విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పేవారు సక్రమమైన మార్గంలోనే నడవాలి.
Also Read: Condom Addiction: యువత కండోమ్ ల పిచ్చి.. ఎగబడి కొంటున్నారట?
తాజాగా చత్తీస్ గడ్ లోని జైపూర్ లో ఓ సంఘటన జరిగింది. సాక్షాత్తూ జిల్లా విద్యాధికారి ఎదుటే ఓ మహిళా ఉపాధ్యాయురాలు తాగి పడుకున్న ఘటన ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులకే మచ్చ తెస్తోంది. సదరు డీఈవో ఏదో ఆరోగ్యం బాగాలేకపోవడంతో పడుకుందని అనుకున్నా విద్యార్థులను ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. దీంతో ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువులకే కళంకం తెచ్చే ఇలాంటి వారు ఉండటం నిజంగా సిగ్గు చేటు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన టీచరే పాడు పని చేస్తే వారి భవిష్యత్ ఏమిటి? వారు కూడా అదే బాటలో నడవరని నమ్మకం ఏంటి? వారు తాగొచ్చినా టీచర్ కో నీతి మాకో న్యాయమా? అంటే ఏం సమాధానం చెబుతారు? ఎవరు సర్ది చెబుతారు అన ప్రశ్నలు అందరిని వేధిస్తున్నాయి.
గరుర్ బ్రహ్మ, గురుర్ విష్ణుహు, గురు దేవో మహేశ్వర అంటే గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడితో సమానమని మనం రోజు కొలిచే శ్లోకాలకు కూడా న్యాయం చేయకపోతే ఎలా అనే వాదనలు వస్తున్నాయి. గురు వృత్తికి ద్రోహం చేసే వారిని క్షమించరాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందులో మహిళా ఉపాధ్యాయురాలు అయి ఉండి కూడా మద్యం సేవించడం దారుణం. వ్యక్తిగత జీవితం ఇంటి వద్దే వదిలేయాలి. ఉద్యోగం చేయాలంటే క్రమశిక్షణ ఉండాలి. కానీ ఇలా బరితెగిస్తే విద్యార్థుల భవిష్యత్ ఏమిటన్నదే ప్రశ్నార్థకం.
Also Read:India Population: 41 కోట్ల కోత.. దారుణంగా పడిపోనున్న భారత జనాభా