Voter Card Download: ప్రతీ రంగంలో టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం రంగంలోని కొన్ని విభాగాలు ఎక్కువగా సాంకేతికాన్నే ఉపయోగిస్తున్నారు. గతంలో ఓటరు నమోదు చేసుకోవాలంటే ప్రత్యేకంగా ఫాం నింపిన తరువాత అధికారులు అప్రూవల్ చేసి.. ఆ తరువాత గుర్తింపు కార్డులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసేవారు. ఈక్రమంలో కొన్ని ప్రాంతాల్లో ఓటరు నమోదు కోసం సరైన పత్రాలు అందించినా పేరు నమోదు కాని పరిస్థిత ఉండేది. ఆ తరువాత ఎలక్షన్ కమిషన్ సాంకేతికాన్ని ఉపయోగించి ప్రత్యేకంగా http://eci.gov.in అనే వెబ్ సైట్ ను రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సైట్ ద్వారా ఓటు నమోదు చేసుకోవాలని ప్రచారాన్ని చేస్తోంది. అయినా చాలా మంది యువత దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ఓటరు నమోదు అనుకున్నంతగా నమోదు కావడం లేదు.
ముఖ్యంగా యూత్ పై ఓటరు వెబ్ సైట్ లోకి వెళ్లి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి సమయాన్ని వెచ్చించడం లేదు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఓటరు నమోదుకు, కార్డు డౌన్లోకు కొన్ని మార్పలు చేసి ఈజీ ప్రాసెస్ అయ్యేలా చేసింది. ప్రస్తుతం ఓటరు నమోదు చేసుకోవడానికి పెద్దగా శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఇదివరకే ఓటరుగా నమోదు చేసుకుంటే ఆ కార్డును క్షణాల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ వాడుతుండడంతో దాని ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
యువత, ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి Voters.eci. gov.in అనే వెబ్ సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇందులో ఫారం 6 ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ప్రత్యేకించి యువత ఓటరు నమోదు కోసం అక్టోబర్ 31 వరకు గడువును విధించారు. అయితే ఓటరు నమోదు అయిదో లేదో తెలుసుకోవడానికి 1950 అనే నెంబర్ కు డయల్ చేసి చెక్ చేసుకోవాలన్నారు.
అయితే ఓటరు కార్డులో మార్పులు, చేర్పులు చేసుకునేవారు మాత్రం ఫాం 8 లో వివరాలు అందించాలన్నారు. అయితే ఓటరు కార్డును డౌన్లోడ్ చేసుకోవాలంటే మాత్రం http://Voters.eci. gov.in అనే వెబ్ సైట్ లోకి వెళ్లి e-epic అనే విభాగంలోకి వెళ్లాలి. ఆ తరువాత నిర్దేశించిన చోట కార్డు నెంబర్ ఎంట్రీ చేయాలి. లేదా మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. దీంతో ఓటీపీ వస్తుంది. దానిని ఎంట్రీ చేస్తే వెంటనే కార్డు డౌన్లోడ్ అవుతుంది. గతంలో అసెంబ్లీ సెగ్మెంట్ తదితర వివరాలను అడిగేది. కానీ ప్రస్తుతం అలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.