https://oktelugu.com/

పానీపూరీ తింటే ప్రాణం పోయింది… ఎలా అంటే..?

మనలో పానీపూరీ అంటే తెలియని వారు ఉండరు. కొన్ని ప్రాంతాల్లో పానీపూరీని గప్ చుప్ అని కూడా పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పానీపూరీ అంటే ఎంతో ప్రీతి. చిన్న పూరీలలో చింతపండు నీరు, బఠానీలు, ఉల్లి, బంగాళదుంప మిశ్రమం వేసిన పానీపూరీలు ఎన్ని తిన్నా ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే పానీపూరీ తినే సమయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. జాగ్రత్తలు తీసుకోకుండా పానీపూరీని తింటే ఆ పానీపూరీనే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 24, 2020 8:22 pm
    Follow us on

    women lost life eating panipuri

    మనలో పానీపూరీ అంటే తెలియని వారు ఉండరు. కొన్ని ప్రాంతాల్లో పానీపూరీని గప్ చుప్ అని కూడా పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ పానీపూరీ అంటే ఎంతో ప్రీతి. చిన్న పూరీలలో చింతపండు నీరు, బఠానీలు, ఉల్లి, బంగాళదుంప మిశ్రమం వేసిన పానీపూరీలు ఎన్ని తిన్నా ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే పానీపూరీ తినే సమయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి.

    జాగ్రత్తలు తీసుకోకుండా పానీపూరీని తింటే ఆ పానీపూరీనే మన పాలిట మృత్యుపాశమయ్యే అవకాశం ఉంది. తొందరగా పానీపూరి తినాలని ప్రయత్నిస్తే గొంతులో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంది. తాజాగా ఒరిస్సాలో ఒక మహిళ ప్రాణాలను పానీపూరీ బలి తీసుకుంది. 30 ఏళ్ల మహిళ పానీపూరీ వల్ల ప్రాణాలను కోల్పోయింది. సుందరగడ్‌ జిల్లా లెఫ్రిపడా పోలీసు స్టేషన్‌ పరిధి సరఫ్‌గడ్‌ గ్రామంలో మొన్న రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

    పూర్తి వివరాల్లోకి వెళితే ఫూలమతి కిషాన్‌ అనే మహిళ తమ ఇంటికి సమీపంలో ఉన్న పానీపూరీ బండి దగ్గరకు భర్త, కొడుకుతో కలిసి పానీపూరీ తినడానికి వెళ్లింది. అయితే పానీపూరీని సాధారణంగా తినకుండా సదరు మహిళ మింగడానికి ప్రయత్నించింది. అయితే మింగే క్రమంలో పానీపూరీ కడుపులోకి పోకుండా గొంతు దగ్గరే ఆగిపోయింది. మహిళ కింద పడిపోగా అక్కడ ఉన్నవాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

    శ్వాస ఆడకపోవడం వల్ల ఆమె ఇబ్బంది పడుతోందని గమనించి వెంటనే మహిళ కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే వైద్యులు ఆమెను పరిశీలించి మహిళ అప్పటికే మృతి చెందిందని వెల్లడించారు. మహిళ తొందరపాటు చర్యే ప్రాణాలు పోవడానికి కారణమైందని తెలిపారు.