Women 900 Marraiges : జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొందరు తమ పేరు రికార్డుల్లో నమోదు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ తరుణంలో మిగతా వారి కంటే విభిన్నంగా ఉంటూ చరిత్ర పుటల్లో ఎక్కాలని చూస్తారు. అయితే వీరు మంచి పనులు చేస్తే సమాజంలో గుర్తింపు రావడంతో పాటు చరిత్రలో నిలిచిపోతారు. కానీ కొందరు సమాజానికి వ్యతిరేక పనులు చేసి కూడా ప్రపంచంలో ప్రత్యేక వ్యక్తిగా నిలుస్తూ ఉంటారు. ఇలాంటి వారిలో మహిళ ప్రపంచ రికార్డును నెలకొల్పి అందరి చేత చర్చించుకునేలా చేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 900 పెళ్లిళ్లు చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. అసలు ఆమె ఇలా ఎందుకు చేసింది? ఇంతకీ ఆమె ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..
ఇప్పుడున్న కాలంలో కాస్త వయసు అటూ ఇటూ అయితే ఒక పెళ్లి కావడమే గగనంగా మారింది. మన ఇండియాలో అయితే మగవారి కంటే ఆడవారి వయసు ఎక్కువగా ఉంటే పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో కొందరు తల్లిదండ్రులు వయసు ఎక్కడ ఎక్కువగా అవుతుందోనని ఆడపిల్లలు ఉన్నవారు తొందరగా ఎవరో ఒకరిని చూసి తెలియజేస్తున్నారు. ఈ తరుణంలో అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లిళ్లు చేసి తమ పనిని పూర్తి చేసుకుంటున్నారు. అయితే ఓ మహిళ మాత్రం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 900 పెళ్లిళ్లు చేసుకుంది.
Also Read : తమ కంటే చిన్నవారితోనే మహిళలు ప్రేమలో పడతారట.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే?
యాంగ్మి అనే ఓ మహిళ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఎందుకంటే ప్రపంచమంతా ఆమె గురించి మాట్లాడుకునేలా చేసింది. డబ్బు సంపాదనని దేంగా పెట్టుకున్న ఆమె ఊహించని రీతిలో పెళ్లిళ్లు చేసుకుంది. 1993లో మొదలుపెట్టిన ఆమె పెళ్లిళ్ల పరంపర అప్పటినుంచి కొనసాగిస్తూ వస్తుంది. అప్పటినుంచి పెళ్లిళ్లు చేసుకోవడం.. విడాకులు ఇవ్వడం వంటివి చేస్తూనే ఉంది.. అయితే ఇప్పటివరకు ఆమె నెలకు 8 డాలర్ల చొప్పున సంపాదిస్తూ వచ్చింది. ఇలా ఇప్పటివరకు ఎన్నో డాలర్లు సంపాదించింది.
అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ లేడీ ఏమాత్రం చదువుకోలేదు. అయినా కూడా తనే తెలివితో మగవాళ్ళను ఆకట్టుకుంటూ వారిని టాప్ లో పడేసి డబ్బులు గుంజుతూ వచ్చింది. అయితే ఓ వ్యక్తి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు మోసం బయటపడింది. 2011లో ఈమెను అరెస్టు చేశారు. ఈ లేడీ గురించి ఇప్పటికే రికార్డులో నమోదు అయింది. ఇలాంటి కిలేడి గురించి జాగ్రత్తగా ఉండాలని చాలామంది అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా డబ్బు మాయిలో పడి ఇలాంటి వారిని వలలో పడద్దని సూచిస్తున్నారు.
అయితే ఈ కిలేడీ తర్వాత ప్రస్తుతానికి ప్రపంచంలో ఎవరు అంతా మోసం చేయలేదని కొందరు పేర్కొంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో లేదా కొన్ని ప్రాంతాల్లో లెక్కకు మించి పెళ్లి చేసుకుంటూ మగవాళ్ళను మోసం చేస్తూ ఉంటారని కొందరు ఆరోపిస్తున్నారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఏదో ఆశపడి వారిని పెళ్లి చేసుకోవడం ద్వారా జీవితం సర్వనాశనం అవుతుందని చెబుతున్నారు.