Dragon Movie Collections : మన తెలుగు ఆడియన్స్ కి మంచి సినిమాని అందిస్తే చాలు. హీరో ఎవరైనా, ఏ భాషకి సంబంధించిన వాడైనా సరే, ఆ సినిమాకి బ్రహ్మరథం పట్టేస్తారు. మన తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమకి ఏ ఇతర భాషలకు సంబంధించిన హీరోలు, దర్శకులు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇప్పుడు యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) పరిస్థితి కూడా అంతే. ఇతని పేరు మన తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా ఎవరికీ తెలియదు. కానీ ఇతను తెలుగు లో ఇప్పుడు రెండు సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ‘లవ్ టుడే’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, ఇక ఫిబ్రవరి 21 న విడుదలైన ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనమంతా చూసాము. తెలుగు లో ఈ సినిమా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon) అనే పేరుతో విడుదలైంది.
తమిళం లో ఈ చిత్రానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, తెలుగు లో అంతకు మించి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ కేవలం కోటి 20 లక్షలు మాత్రమే. కానీ 9వ రోజు ఏకంగా కోటి 90 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక నేడు అయితే రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 9 రోజులకు గాను 13 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 7 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళ భాషలకు కలిపి 9 రోజుల్లో 96 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ప్రాంతాల వారీగా ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాము.
Also Read : ‘డ్రాగన్’ మూవీ ని తెలుగులో మిస్ చేసుకున్న యంగ్ హీరో అతనేనా..? దురదృష్టం మామూలు రేంజ్ లో లేదుగా!
తమిళనాడు ప్రాంతం లో 51 కోట్ల 25 లక్షలు, తెలుగు రాష్ట్రాల్లో 13 కోట్ల 65 లక్షలు, కర్ణాటక లో 7 కోట్ల 30 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్లు, ఓవర్సీస్ లో 21 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల రూపాయిల గ్రాస్, 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నేటి తో ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరనుంది. ఫుల్ రన్ లో మరో 50 కోట్ల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు లో వరుసగా డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు వస్తున్న సమయంలో ఈ సినిమా ఆ ఇండస్ట్రీ ని ఆదుకుంది. పెద్ద ఆర్ధిక సంక్షోభం నుండి ఆ ఇండస్ట్రీ ని బయట పడేసింది. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది.
Also Read : మర్యాదగా ఆ వీడియోలు తొలగించండి..మీనాక్షి తో నాకు ఎలాంటి సంబంధం లేదంటూ అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్!