Women love with younger men : ప్రేమ అనేది రెండు అక్షరాలు. ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం. వయస్సుతో (Age) సంబంధం లేకుండా ప్రేమ అనేది పుడుతుంది. అయితే పురుషుల విషయం పక్కన పెట్టి స్త్రీల విషయానికొస్తే.. వీరు ఎక్కువగా తమ కంటే పెద్దవారిని ఇష్టపడతారని చాలా మంది అంటుంటారు. కానీ అమ్మాయిలు (Girls) ఎక్కువగా తమ కంటే చిన్న వారినే ఇష్టపడతారట. పూర్వం రోజుల్లో అయితే అమ్మాయిలు కంటే వయస్సులో పెద్దవారినే పెళ్లి చేసుకునే వారు. కానీ ప్రస్తుతం రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా అమ్మాయిలు చిన్నవాళ్లను కూడా వివాహం చేసుకుంటున్నారు. కానీ పురుషులు మాత్రం తమ కంటే చిన్నవారిని ఎక్కువగా ఇష్టపడతారు. కొన్ని సందర్భాల్లో చిన్న వారు అయితే అర్థం చేసుకోవడానికి, అన్నింటికి బాగుంటుందని భావిస్తారు. అయితే మహిళలు తమ కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషులని ఇష్టపడటానికి గల కారణాలు ఏంటి? వీటిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
దాదాపు 4500 మందిపై అధ్యయనం చేసి.. స్త్రీలు ఎక్కువగా తమ కంటే వయస్సులో తక్కువగా ఉన్నవారినే ఇష్టపడతారని తేల్చారు. వీరిలో 22 నుంచి 85 సంవత్సరాల వరకు ఉన్నవారందరూ కూడా పాల్గొన్నారు. వీరిలో పురుషులతో పాటు మహిళలు కూడా తమ కంటే చిన్నవారితోనే డేటింగ్ చేయడానికి ఇష్టపడినట్లు ఈ అధ్యయనంలో తేలింది. మహిళలు తమ కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కంటే తక్కువ వయస్సు ఉన్న పురుషుల పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళలను వారి ప్రేమ భావనల గురించి కూడా తెలియజేశారు. స్త్రీలు కంటే తక్కువ వయస్సు ఉన్న యువకుల ఉత్సాహం, శక్తి అన్ని కూడా మహిళలను ఎంతగానో ఆకర్షిస్తాయట. అందుకే డేటింగ్ విషయంలో వీర ఎక్కువగా చిన్నవారినే ఆకట్టుకుంటారు. కొందరు వారికి తెలియకుండానే ఆకర్షితులు అవుతుంటారు. అయితే పురుషుల కంటే స్త్రీలు తక్కువ వయస్సు ఉండటం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుందని కొందరు అంటున్నారు.
ఈ మధ్య కాలంలో జనరేషన్ పూర్తిగా మారిపోయింది. వయస్సు, చిన్న, పెద్ద ఇలా తేడాలు అంటూ ఏం లేవు. నచ్చితే చాలు.. వయస్సులో పెద్ద లేదా చిన్న అయినా కూడా చేసుకుంటున్నారు. జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలి. అంతే కానీ వయస్సు అడ్డు కాదనే ఆలోచనలో ఉన్నారు. కానీ పురుషునికి, స్త్రీలకు మధ్య కనీసం 5 ఏళ్లు అయిన గ్యాప్ ఉండాలి. అప్పుడే అన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి బాగుంటుంది. వయస్సు ఎక్కువగా డిఫరెన్స్ అయినా కూడా అన్ని విషయాలు అర్థం చేసుకోలేరు. అదే వయస్సు తక్కువగా ఉంటే ఇద్దరి ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తక్కువలో ఒక ఐదు సంవత్సరాలు అయినా కూడా గ్యాప్ ఉంటే అన్ని విధాలుగా భార్యాభర్తలు అర్థం చేసుకుని జీవించడానికి బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.