Homeట్రెండింగ్ న్యూస్Designer James Fridman: ట్రాష్ లేడిని తీసేయమన్నందుకు.. చెత్తతో నింపేశాడు

Designer James Fridman: ట్రాష్ లేడిని తీసేయమన్నందుకు.. చెత్తతో నింపేశాడు

Designer James Fridman: మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే ఏమవుతుంది? శరీరం మొత్తం చెమట కంపు కొడుతుంది. అదే మన వీధిలోనో, మెయిన్ రోడ్డు మీదనో పోగుపడిన చెత్తను తొలగించకపోతే ఎలా ఉంటుంది? ఏముంది ముక్కు పుటాలు అదిరిపోయేలాగా వాసన వస్తుంది. అలాంటి చెత్తను పారిశుద్ధ్య సిబ్బంది తొలగించకపోతే మన జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇంతటి కంపును భరించుకుంటూ, చెత్తను ఎప్పటికప్పుడు తొలగిస్తున్న ఆ పారిశుద్ధ్య సిబ్బంది అంటే మనలో చాలామందికి చులకన భావం ఉంటుంది. మన దగ్గర మాత్రమే కాదు అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇదే తరహా ధోరణి ఉంటుంది. అలాంటి ధోరణిని ప్రదర్శించిన ఓ యువతికి బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత ఫోటోషాప్ నిపుణుడు జేమ్స్ ఫ్రిడ్ మాన్ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు.

బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఫ్రిడ్ మాన్ ఫోటోషాప్ లో అద్భుతమైన ప్రతిభ చూపిస్తాడు. ప్రఖ్యాత గ్రాఫిక్ డిజైనర్ కూడా ప్రసిద్ధి చెందాడు. ఫోటోలను సహజంగా ఎడిటింగ్ చేసే నైపుణ్యం ఇతడి సొంతం. ఇతడికి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంది. సోషల్ మీడియా ద్వారా చాలామంది అతడిని సంప్రదించి తమ ఫోటోలను ఎడిట్ చేయమని అడుగుతుంటారు. తనకు వీలు చిక్కినప్పుడల్లా వారు కోరినట్లు జేమ్స్ ఫోటోలు ఎడిట్ చేస్తూ ఉంటాడు. ఇటీవల అతడికి ఒక మహిళ నుంచి విచిత్రమైన అభ్యర్థన వచ్చింది. ఆ విషయాన్ని జేమ్స్ సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నాడు. ఓ మహిళ ఇటీవల తాను తీయించుకున్న ఫోటోను జేమ్స్ కు పంపించింది. ఆ ఫోటోలో ఆమెతోపాటు రోడ్డుమీద చెత్త ఏరుతున్న మహిళ కూడా పడింది. దీంతో ఆ ఫోటోను జేమ్స్ కు పంపించి.. ఆ ఫోటో నుంచి ఆ చెత్త ఏరుకుంటున్న మహిళను తొలగించాలని విన్నవించింది. ” హాయ్ జేమ్స్ ఈ ఫోటో నచ్చింది. ఈ ఫోటోలో ఉన్న ట్రాష్ లేని ఎడిట్ చేయగలవా? ఎందుకంటే నాకు ఆరెంజ్ కలర్ నచ్చదు?” అని రిక్వెస్ట్ చేసింది.

తర్వాత ఏమైందంటే

ఆ మహిళ రిక్వెస్ట్ కు స్పందించిన జేమ్స్.. ఆమె కోరినట్టుగానే ఆ ట్రాష్ లేడిని ఆ ఫోటో నుంచి తొలగించాడు. అయితే అందరూ ఊహించినట్టు కాకుండా ఆ ఫోటోలో మరిన్ని చెత్త సంచులను జోడించాడు. ఈ విషయాన్ని జేమ్స్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు ఈ ఫోటోను 1.40 కోట్ల మంది వీక్షించారు. 2.62 లక్షల లైక్స్ వచ్చాయి. జేమ్స్ మాత్రమే కాకుండా నెటిజన్లు కూడా ఆ ఫోటోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.” ట్రాష్ లేడీ లేకపోతే నిండి ఉండేది చెత్తే. హా హా అద్భుతంగా ఎడిటింగ్ చేశారు. జేమ్స్ నిజమైన లెజెండ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular