Tamannaah Bhatia: తమన్నా భాటియా ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా సౌత్ తో పాటు నార్త్ లో కుడా ఫేమ్ రాబట్టారు. ప్రస్తుతం భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమల్లో చిత్రాలు చేస్తున్నారు. రెండు దశాబ్దాల కెరీర్లో తమన్నా పై ఎఫైర్ రూమర్స్ వచ్చింది తక్కువే. అయితే కొద్ది నెలలుగా ఆమె రిలేషన్ లో ఉన్నారనే కథనాలు వరుసగా వెలువడుతున్నాయి. బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్ చేస్తున్నారనేది మీడియా వర్గాల వాదన.
2023 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కలిసి జరుపుకున్న ఈ జంట పలుమార్లు కలిసి కనిపించారు. ఇటీవల రహస్యంగా డిన్నర్ నైట్ కి వెళుతూ మీడియా కంటికి చిక్కారు. దాంతో చేసేదేమీ లేక హాయ్ అంటూ చిరు నవ్వులు చిందించారు. పరిణామాలు చూస్తుంటే వారు రిలేషన్ లో ఉన్నారన్నది ఖాయం అన్నట్లు ఉన్నాయి. తమన్నా మాత్రం బుకాయిస్తూ వచ్చింది. నేను సింగిల్ అని అబద్దం చెప్పింది.
ఎట్టకేలకు తమన్నా ఓపెన్ అయ్యింది. అవును నేను-విజయ్ వర్మ రిలేషన్ లో ఉన్నామని క్లారిటీ ఇచ్చింది. అలాగే తమ ప్రేమ ఎక్కడ ఎలా మొదలైందో కూడా చెప్పింది. లస్ట్ స్టోరీస్ సీజన్ 2 లో విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించారు. వీరి మధ్య కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ యాంథాలాజి సిరీస్ షూటింగ్ లో విజయ్ వర్మ తనకు దగ్గరయ్యాడట. కేవలం సహ నటుడు కావడం వలన ఇష్టపడలేదట. విజయ్ వర్మ చాలా ప్రత్యేకం. నాకు రక్షణగా ఉంటాడనే విశ్వాసం ఏర్పడింది. నన్ను క్రిందికి లాగాలని చూసే వారి నుండి కాపాడతాడు.
నాకంటూ ఓ ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. ఆ ప్రపంచంలోకి నన్ను అర్థం చేసుకునే విజయ్ వర్మ వచ్చాడు. తాను ఎక్కడ ఉంటే నాకు అక్కడ ఆనందం.. అంటూ తమన్నా చెప్పుకొచ్చారు. తమన్నా ప్రస్తుతం భోళా శంకర్, జైలర్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండూ ఇండిపెండెన్స్ డే కానుకగా విడుదల కానున్నాయి. భోళా శంకర్, జైలర్ చిత్రాలతో చిరంజీవి, రజినీకాంత్ పోటీపడుతున్నారు.